ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సితార అంత సంపాదిస్తుందా.?
21 March 2025
Prudvi Battula
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని క్రేజ్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు.
ఇంకా సినిమాల్లో రానప్పటికీ స్టార్ కిడ్ గా సోషల్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేక పాపులారిటీని సంపాదించుకుంది.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సితార తన వీడియోలతో పాటు, ఫోటోలను అందులో పంచుకుంటుంది.
తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఫాలోవర్స్‌ను మరింతగా పెంచుకుంటోంది.
ఈ క్రమంలోనే సితార ఘట్టమనేని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెద్ద మొత్తంలోనే ఆదాయం ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది.
సితార కేవలం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెలకు సుమారు 30 లక్షల నుంచి 35 లక్షల వరకు సంపాదిస్తుందని నెట్టింట టాక్.
ఇదిలా ఉంటె తాజాగా తన తండ్రితో కలిసి ఓ షాపింగ్ యాడ్ చేసింది. ఇందులోనే తొలిసారి మహేష్ బాబు, సితార కలిసి నటించారు.
ఇక 2024లో వచ్చిన గుంటూరు కారం తర్వాత గ్యాప్ తీసుకున్న మహేశ్ బాబు ఇప్పుడు రాజమౌళి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
సామ్ టెన్త్ మార్క్స్ ఎంతంటే.?
నన్ను అలా పిలవడం నచ్చదు: శ్రీలీల..
ఆ పనే చేసేవాడిని: హీరో నాని..