నన్ను అలా పిలవడం నచ్చదు: శ్రీలీల..
20 March 2025
Prudvi Battula
పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ వెండి తెరకు పరిచయమైంది శ్రీలీల. తొలి సినిమాతోనే తన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది.
ఆ తర్వాత రవితేజతో కలిసి ధమాకా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిందీ అందాల తార. ఈ మూవీ 100 కోట్లకు పైగానే రాబట్టింది.
ఆ తర్వాత ఆదికేశవ, స్కంద, గుంటూరు కారం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి వరుసగా పెద్ద సినిమాల్లో నటించిందీ ముద్దుగుమ్మ.
ఈ సినిమాలు విజయం సాధించకపోయినా శ్రీలీల నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది.
ఇప్పుడు నితిన్ రాబిన్ హుడ్, రవితేజ మాస్ జాతర, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వంటి పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉంది శ్రీలీల.
కాగా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకున్న శ్రీలీల తనను మాత్రం.. స్టార్ హీరోయిన్ అని పిలవకండని రిక్వెస్ట్ చేస్తోంది.
స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలని ఉందని కానీ, ఇప్పుడే తనను అలా పిలవడం నచ్చదని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం ఆమె నటించిన రాబిన్ హుడ్ మూవీ మార్చ్ 28న విడుదల కానున్న సందర్భంగా.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆ హిట్ సినిమాను రిజెక్ట్ చేసిన శ్రీవల్లి..
నటి కాకపోతే అదే చేసేదాన్ని: నిత్య మీనన్..
చనిపోయే పాత్రల్లో నటించి మెప్పించిన హీరోలు వీరే..