నటి కాకపోతే అదే చేసేదాన్ని: నిత్య మీనన్..
19 March 2025
Prudvi Battula
చేసింది తక్కువ సినిమాలే అయినా దక్షిణాది స్టార్ హీరోయిన్ నిత్యా మేనన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ మలయాళ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, శర్వానంద్ లాంటి స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.
కేవలం తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల అభిమానం పొందింది ఈ భామ.
తన అభినయ ప్రతిభకు ప్రతీకగా జాతీయ ఉత్తమ నటి పురస్కారం కూడా గెల్చుకుంది సౌత్ ఇండియా హీరోయిన్ నిత్యా మేనన్.
గతంలో ధనుష్ నటించిన తిరు చిత్తంబంలం (తెలుగులో తిరు) సినిమాలో నటనకు గానూ ఆమెకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకుంది.
కాగా ఒక సందర్భంలో మీరు సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఏమయ్యవారు అని ప్రశ్నించగా.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది నిత్య.
ఒకవేళ నేను నటిని కాకపోయి ఉంటే జర్నలిస్ట్ అయ్యదాన్నని, తన కల కూడా అదేనంటూ చెప్పుకొచ్చింది నిత్యా మేనన్.
మరిన్ని వెబ్ స్టోరీస్
విజయ్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్స్ ఇవే..
పూనకాలు తెప్పిస్తున్న స్టార్ హీరోల లైనప్..
తారక్ ఆస్తులు విలువ తెలిస్తే మైండ్ బ్లాక్.!