చనిపోయే పాత్రల్లో నటించి మెప్పించిన హీరోలు వీరే..
19 March 2025
Prudvi Battula
నాగార్జున: 2000లో ఆర్. ఆర్. షిండే దర్శకత్వంలో వచ్చిన “నిన్నే ప్రేమిస్తా” సినిమాలో నాగార్జున చనిపోతాడు.
వెంకటేష్: 2000లో ఎన్. శంకర్ రూపొందించిన చిత్రం జయం మనదేరా. ఈ మూవీలో వెంకీ మహాదేవ నాయుడు పాత్ర మరణిస్తుంది.
ఎన్టీఆర్: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన “ఆంధ్రావాలా”, కే. ఎస్. రవీంద్ర డైరక్షన్ లో వచ్చిన “జై లవ కుశ” సినిమాల్లో ఎన్టీఆర్ చనిపోతాడు.
ప్రభాస్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ “బాహుబలి”తో పాటు దీనికి ముందు “చక్రం”, “బిల్లా” సినిమాల్లో ప్రభాస్ చనిపోతాడు.
రవితేజ: 2006లో రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన “విక్రమార్కుడు” సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ మరణిస్తాడు.
నాని: నాని న్యాచురల్ స్టార్ నాని ఈగ, జెర్సీ, భీమిలి కబడ్డీ జట్టు, జెంటిల్ మన్, శ్యామ్ సింఘ రాయ్ ఏకంగా ఐదు సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసాడు.
సాయి ధరమ్ తేజ్: 2021 లో దేవ కట్ట దర్శకత్వంలో వచ్చిన “రిపబ్లిక్” ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సినిమా చివరిలో మరణిస్తాడు.
రానా: డైరెక్టర్ తేజ 2017లో తీసిన “నేనే రాజు నేనే మంత్రి” సినిమాలో హీరో రానా, హీరోయిన్ కాజల్ కూడా మరణిస్తారు.
అల్లు అర్జున్: అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వేదం సినిమా క్లైమాక్స్‌లో బన్నీ పాత్ర మరణిస్తుంది.
రామ్ చరణ్: రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ మగధీర. ఈ సినిమాలో చెర్రీ చేసిన భైరవ పాత్ర మరణించి తిరిగి హర్షగా జన్మించినట్టు చూపించారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
విజయ్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్స్ ఇవే..
పూనకాలు తెప్పిస్తున్న స్టార్ హీరోల లైనప్..
తారక్ ఆస్తులు విలువ తెలిస్తే మైండ్ బ్లాక్.!