సామ్ టెన్త్ మర్క్స్ ఎంతంటే.?
20 March 2025
Prudvi Battula
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలు చేసినా, చేయకున్నా ఆమె క్రేజ్ తగ్గడం లేదు.
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సమంత ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
తాజాగా సమంతకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సామాజిక మాధ్యమాల్లో బాగా హల్‌చల్ చేస్తుంది. ఏంటది.? ఈరోజు చూద్దాం..
నటనలోనే కాదు, చదువులోనూ సమంత టాపర్ అట. తాజాగా ఆమె మార్కుల మెమో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
చెన్నైలోని స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో చదివిన సామ్‌కు టెన్త్ క్లాస్ హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్‌లో 1000 మార్కులకు గాను 887 మార్కులు వచ్చాయి.
అందులో అత్యధికంగా మ్యాథ్స్ పేపర్-1 లో 100కు వంద మార్కులు రాగా, రెండో పేపర్‌లోనూ 99 మార్కులు రావడం విశేషం.
ఇంగ్లిష్ మొదటి పేపర్‌లో 90 మార్కులు, రెండో పేపర్‌లో 74 మార్కులు సాధించగా, తమిళ్ మొదటి పేపర్‌లో 83 మార్కులు, రెండో పేపర్‌లో 88 మార్కులు వచ్చాయి.
అదేవిధంగా ఫిజిక్స్‌లో 95, బోటనీలో 84, హిస్టరీలో 91, జియోగ్రఫీలో 83 మార్కులు సాధించింది సమంత. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆ హిట్ సినిమాను రిజెక్ట్ చేసిన శ్రీవల్లి..
నటి కాకపోతే అదే చేసేదాన్ని: నిత్య మీనన్..
చనిపోయే పాత్రల్లో నటించి మెప్పించిన హీరోలు వీరే..