ఆ సినిమా డబ్బింగ్‎కి వెళ్లి షాక్ అయ్యాను: ప్రియా భవాని శంకర్..

ఆ సినిమా డబ్బింగ్‎కి వెళ్లి షాక్ అయ్యాను: ప్రియా భవాని శంకర్..

image

22 March 2025

Prudvi Battula 

Credit: Instagram

కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హీరోయిన్ ప్రియా భవానీ శంకర్. ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుంది.

కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హీరోయిన్ ప్రియా భవానీ శంకర్. ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుంది.

ఆ తర్వాత పాత్ర ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ బ్యూటీ.

ఆ తర్వాత పాత్ర ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ బ్యూటీ.

ఓ పెద్ద హీరో సినిమాలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ సందర్భంలో పంచుకుంది. ఆ మూవీ గురించి అసలు విషయం చెప్పేసింది.

ఓ పెద్ద హీరో సినిమాలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ సందర్భంలో పంచుకుంది. ఆ మూవీ గురించి అసలు విషయం చెప్పేసింది.

న్యూస్ రీడర్‏గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత తమిళంలో బుల్లితెరపై పలు సీరియల్స్ చేసి అలా నెమ్మదిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆఫర్స్ అందుకుంది.

ఓ స్టార్ హీరో సరసన తనకు నటించే ఛాన్స్ వచ్చిందని.. దీంతో ఎంతో ఇష్టపడి ఆ సినిమాలో దాదాపు 55 రోజులపాటు షూటింగ్ చేసినట్లు గుర్తుచేసుకుంది.

షూటింగ్ పూర్తైన తర్వాత డబ్బింగ్ చెప్పడానికి వెళ్లగా షాక్ అయ్యానని.. ఆ సినిమాలో తన పాత్ర కేవలం 5 నిమిషాల కంటే తక్కువగా ఉందని చెప్పుకొచ్చింది.

షూటింగ్ అంతా ఏమైందని ఆ సినిమా దర్శకుడిని అడిగితే అదంతా మ్యూజిక్‏లో వస్తుందని చెప్పాడని.. ఆ హీరోకు కాల్ చేసి విషయం చెప్పానని అన్నారు.

తానూ 135 రోజులు షూటింగ్ చేశానని.. తన సన్నివేశాలే లేవని ఆ హీరో తనకు చెప్పారని చెప్పుకొచ్చింది. అయితే ఏ సినిమా , ఏ హీరో అనేది చెప్పలేదు.

Priya Bhavani Shankar

Priya Bhavani Shankar