ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
రాను రాను వివాహేతర సంబంధాలు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో స్త్రీ పురుషులు దారుణాలకు తెగబడుతున్నారు. వివాహేతర సంబంధాల మోజులో ఒకర్ని ఒకరు చంపుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ ప్రేమించి పెళ్లాడిన భర్తను ప్రియుడి మోజులో పడి ముక్కలు ముక్కలుగా నరికిపారేసింది. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ దారుణ ఘటన తీవ్ర సంచలనంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం.. మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ , ముస్కాన్ రస్తోగి 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యతో ఎక్కువ సమయం గడపాలన్న ఉద్దేశంతో పెళ్లి తర్వాత కొన్నాళ్ళు ఉద్యోగాన్ని వదిలేశాడు. ఈ నిర్ణయం కుటుంబంలో గొడవలకు కారణమైంది. దీంతో సౌరభ్ తన భార్యతో కలిసి మీరట్‌లో వేరు కాపురం పెట్టాడు. 2019లో సౌరభ్ దంపతులకు కుమార్తె జన్మించింది. ఈ క్రమంలో ముస్కాన్‌కు మరొకరితో వివాహేతర సంబంధం ఉందన్న విషయం సౌరభ్‌కు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇక భార్యతో కలిసి ఉండటం సాధ్యం కాదని భావించిన సౌరభ్ విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ, కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విడాకుల నిర్ణయం విరమించుకున్నాడు. తిరిగి తన ఉద్యోగంలో చేరేందుకు 2023లో లండన్ వెళ్లాడు. ఫిబ్రవరి 28న కుమార్తె ఆరో పుట్టిన రోజు కావడంతో ఫిబ్రవరి 24న ఇంటికొచ్చాడు. మరోవైపు, తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని ఎప్పటి నుంచో ప్రణాళికలు రచిస్తున్న ముస్కాన్.. ప్రియుడు సాహిల్ తో కలిసి భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. పథకంలో భాగంగా మార్చి 4న భోజనంలో నిద్రమాత్రలు కలిపి భర్తకు వడ్డించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్ క్రేజ్ అంటే!