దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్ క్రేజ్ అంటే!
ఆఫ్టర్ త్రిపుల్ ఆర్... కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన దేవర పార్ట్ 1మూవీ... 2024 సెప్టెంబర్ 7న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైంది. 550 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనూ రేర్ ఫీట్‌ను అఛీవ్ చేసింది. నాన్ ఇంగ్లీస్ సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వీక్షణలతో నాలుగో స్థానంలో నిలిచింది దేవర.
అలాంటి ఈ సినిమా జపాన్‌లో కూడా విడుదలకు సిద్ధమవుతోంది. మార్చి 19, 2025న జపాన్‌లో ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్ జరిగింది. అక్కడ కూడా దేవర సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సహం రెట్టింపైంది. ఇక ఎన్టీఆర్ కు జపాన్ లోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా అక్కడ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు దేవర సినిమా రిలీజ్ అవ్వనుండటంతో జపాన్ అభిమానులు సందడి చేస్తున్నారు. తాజాగా జపాన్ ఫ్యాన్స్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ కటౌట్ పెట్టి దానికి పూజ చేసేస్తున్నారు కొంతమంది జపాన్ అమ్మాయిలు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే “దేవర: పార్ట్ 2” గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, కానీ అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు తారక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ పండు గుండె జబ్బులకు వరం.. ఒక్కసారి తిన్నా..
కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..
ఈ పండ్లు తింటే.. షుగర్ మీ కంట్రోల్‌లో ఉంటుంది