కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..
ఒక్కోసారి మనకు తెలియకుండా చేసే చిన్న పొరపాట్లకు కూడా పెద్ద మూల్యం చెల్లించే పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితే స్టార్‌బక్స్ కాఫీ కంపెనీకి ఎదురైంది. తెలియకుండా చేసిన పొరపాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఓ వ్యక్తి తొడపై వేడివేడి స్టార్‌బక్స్ కాఫీ పడటంతో.. అతడికి 50 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.415 కోట్లు పరిహారంగా చెల్లించింది.
కాఫీ మూతను సరిగ్గా క్లోజ్ చేయకుండా కస్టమర్‌కు ఇవ్వడంతో.. ఆ వేడివేడి కాఫీ.. సదరు కస్టమర్ తొడపై పడింది. తద్వారా అతడి జననాంగాలకు గాయమైంది. దీనిపై అతడు 2020లో కోర్టుకు వెళ్లగా.. స్టార్‌బక్స్‌కు పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ సంఘటన అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో జరిగింది. వేడివేడి స్టార్‌బక్స్ కాఫీ మీద పడటంతో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి పరిహారం కోరుతూ స్టార్‌బక్స్‌పై 2020లో కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టులో దావా వేశాడు. మీడియా నివేదికల ప్రకారం, సదరు వ్యక్తి న్యాయవాది మైఖేల్ పార్కర్.. తన క్లయింట్ ఆర్డర్ చేసిన కాఫీ డెలివరీ చేసినప్పుడు స్టార్‌బక్స్ దాని మూతను సరిగ్గా క్లోజ్ చేయలేదని ఆరోపించాడు. దీని వల్ల తన క్లయింట్‌పై వేడి కాఫీ పడిందని, దీనివల్ల అతడు శారీరక బాధను మాత్రమే కాకుండా మానసిక వేదన కూడా అనుభవించాడని కస్టమర్ తరపు న్యాయవాది వాదించాడు. వాదోపవాదనలు విన్న కోర్టు.. ఇటీవలే తుది తీర్పును ఇచ్చింది. స్టార్‌బక్స్ సంస్థ బాధితుడికి 50 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ పండ్లు తింటే.. షుగర్ మీ కంట్రోల్‌లో ఉంటుంది
వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
ఈ రెండు సమస్యలు ఉన్న వారు బంగాళాదుంపను అస్సలు తినకూడదు
రంగులో మునిగిన RGV భామ.. ఇలా చూస్తే పిచ్చెక్కాల్సిందే
‘వేధిస్తున్నాడు.. అన్వేష్‌పై చర్యలు తీసుకోండి’ ఏడుస్తూ రేవంత్‌కు రిక్వెస్ట్