ఈ పండ్లు తింటే.. షుగర్ మీ కంట్రోల్‌లో ఉంటుంది
ఏ సీజన్‌లో లభించే ఫ్రూట్స్ ఆ సీజన్‌లో తింటే ఆరోగ్యానికి మంచిది. సమ్మర్ లో మామిడి, పుచ్చకాయ, కర్బూజా పండ్లు ఎక్కువ. వీటితో పాటు ఎర్రటి ముత్యాల్లా మెరిసిపోతూ కనిపించే ఫాల్సా పండ్లు కూడా సందడి చేస్తుంటాయి. వీటి గురించి చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. ఫాల్సా పండ్లను ఇండియన్ షర్బత్ బెర్రీ అని పిలుస్తారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ఈ పండ్లను ఎక్కువగా తింటారు. మన దగ్గర సమ్మర్ రిఫ్రెష్ డ్రింక్‌గా వినియోగిస్తారు. టేస్టీగా ఉండటమే కాకుండా, ఫాల్సా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చూసేయండి. ఫాల్సా పండ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ ఉంటాయి. విటమిన్ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగునిరోధక శక్తిని మెరుగుపరచడానికి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షించడానికి, గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు ఐరన్ చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు కాల్షియం, ఫాస్పరస్ కీలక పాత్ర పోషిస్తాయి.డయాబెటిస్ బాధితులు ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తప్పని సరిగా తీసుకోవాలి. వీరు తమ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. మధుమేహం ఉన్నవారి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం పెరగడం వల్ల సమస్యలు రావడం చూస్తుంటాం. వేసవిలో షుగర్ బాధితులు వారి చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచే కొన్ని పండ్లను తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ప్రత్యేకమైన ఫాల్సా పండును తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
ఈ రెండు సమస్యలు ఉన్న వారు బంగాళాదుంపను అస్సలు తినకూడదు
రంగులో మునిగిన RGV భామ.. ఇలా చూస్తే పిచ్చెక్కాల్సిందే
‘వేధిస్తున్నాడు.. అన్వేష్‌పై చర్యలు తీసుకోండి’ ఏడుస్తూ రేవంత్‌కు రిక్వెస్ట్
UKలో చిరు పేరుతో దందా..! సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మెగా స్టార్…