Maharasthra: ఉద్ధవ్ థాక్రేకు మరో బిగ్ షాక్.. అది కూడా కుటుంబం నుంచే..!

Maharashtra: నమ్మకద్రోహంతో ముఖ్యమంత్రి పీఠం కోల్పోయిన మాజీ సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేకు బిగ్ షాక్ తగిలింది.

Maharasthra: ఉద్ధవ్ థాక్రేకు మరో బిగ్ షాక్.. అది కూడా కుటుంబం నుంచే..!
Eknath Shinde
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 30, 2022 | 11:46 AM

Maharashtra: నమ్మకద్రోహంతో ముఖ్యమంత్రి పీఠం కోల్పోయిన మాజీ సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేకు బిగ్ షాక్ తగిలింది. ఆయన మేనల్లుడే ఈ షాక్ ఇవ్వడం గమనార్హం. ఉద్ధవ్ మేనల్లుడు నిహార్ థాక్రే.. సీఎం షిండేను కలిసి తన మద్దతు తెలిపారు. ఉద్ధవ్‌ మేనల్లుడు నిహార్‌ ముంబైలో లాయర్‌గా ప్రాక్టిస్‌ చేస్తున్నాడు. ఎంతో నమ్మిన షిండేతో పాటు ఇతర ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే.. ఇప్పుడు అయినవాళ్లే దూరమవుతుండటం థాక్రేను కోలుకోలేకుండా చేస్తోంది.

సెట్ అయిన బేరసారాలు.. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, బీజేపీ హైకమాండ్‌ మధ్య బేరసారాలు కొలిక్కివచ్చాయి. షిండే, బీజేపీ కలిసి అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటినా కేబినెట్‌ విస్తరణ జరగలేదు. దీంతో షిండే వర్గ ఎమ్మెల్యేలు పదవుల పందేరం ఎప్పుడు అని ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో షిండే, బీజేపీ మధ్య జరిగిన చర్చల్లో రాజీ కుదిరిందని చెబుతున్నారు. మహారాష్ట్ర కేబినెట్‌లో 20 పదవులు కావాలని షిండే వర్గం డిమాండ్‌ చేసింది. అయితే 17 బెర్త్‌లు ఇవ్వడానికి బీజేపీ ఒప్పుకుంది. ఈ చర్చల కోసం షిండే సీఎం అయ్యాక నెల రోజుల్లో నాలుగు సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు. బీజేపీ హైకమాండ్‌తో వరుస చర్చలు జరిపారు. మొన్న బుధవారం కూడా మళ్లీ ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నా.. తన వర్గం ఎమ్మెల్యేలతో చర్చల్లో బీజీగా ఉండి వెళ్లలేకపోయారు. అయితే 17 మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ ఓకే చెప్పడంతో కేబినెట్‌ విస్తరణకు ఫార్ములా రూపొందించారట షిండే. అతి త్వరలో విస్తరణ జరుగుతుందని చెబుతున్నారు.

శివసేనలో చీలిక తెచ్చిన షిండే, ఉద్ధవ్‌ థాక్రేను సీఎం పీఠం నుంచి దించేసిన సంగతి తెలిసిందే. ఉద్ధవ్‌ కేబినెట్‌లో మంత్రి పదవులు నిర్వహించి, తన వర్గంలోకి వచ్చిన వారందరికీ మళ్లీ పదవులు దక్కడం గ్యారంటీ అని చెబుతున్నారు. మిగతా వాళ్లకి ఇతర పదవులు కట్టబెడతారట.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..