Andhra Pradesh: కృష్ణా జిల్లాలో దారుణం.. కాపాడాల్సిన తండ్రే కూతురుపై కన్నేశాడు.. చివరకు..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం చోటు చేసుకుంది. కాపాడాల్సిన తండ్రే.. కాటు వేశాడు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం చోటు చేసుకుంది. కాపాడాల్సిన తండ్రే.. కాటు వేశాడు. కామంతో కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నందిగామలోని చందర్లపాడు మండలం కోనాయపాలెంలో వెలుగు చూసింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కోనాపాలెంకు చెందిన ఏడుకొండలు.. పది సంవత్సరాల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. వీరి వద్దనే ఉంటుంది. అయితే అమ్మాయిపై కన్నేసిన రెండో తండ్రి.. ఓ రోజు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో ఆ అమ్మాయి ఎవరికీ చెప్పుకోలేక.. అతని ఆగడాలకు బలైపోతూ వచ్చింది. గత కొంత కాలంగా ఏడుకొండు అమ్మాయిపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. అతని టార్చర్ భరించలేక.. విషయాన్ని బంధువులకు చెప్పినా నమ్మలేదు. అమ్మాయే అబద్ధాలు చెబుతుందని అంతా భావించారు. దాంతో తండ్రి ఏడుకొండలు ఫోన్‌లో మాట్లాడినప్పుడు రికార్డ్ చేసింది. ఆ రికార్డ్‌ను అందరికీ వినిపించింది. దాంతో బంధువులు, స్థానికులు ఏడుకొండులుని పట్టుకుని దేహ శుద్ధి చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. నిందితుడు ఏడుకొండలు పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అతన్ని రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..