AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అన్నాచెల్లెలుగా మెలుగుతున్న యువతీయువకులు.. లవర్స్ అంటూ స్థానికుల నిందలు.. మనస్తాపంతో ఆత్మహత్య

యువతి యువకులు సొంత అన్నాచెల్లెలుగా మెలుగుతున్నా.. వారిద్దరిపై ప్రేమికులంటూ ముద్ర వేయడంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఈ పుకార్లు ఇద్దరి ప్రాణాలు తీశాయి. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

Telangana: అన్నాచెల్లెలుగా మెలుగుతున్న యువతీయువకులు.. లవర్స్ అంటూ స్థానికుల నిందలు.. మనస్తాపంతో ఆత్మహత్య
Brother Sister
Surya Kala
|

Updated on: Aug 11, 2022 | 11:34 AM

Share

Telangana: తన సొంత విషయాలపై పెట్టే దృష్టికంటే.. ఎదుటి వ్యక్తుల మీద పెట్టే దృష్టే ఎక్కువగా ఉంటుంది.. అది సర్వసాధారణంగా మనిషి నైజం.. ఇంకా చెప్పాలంటే.. ఒక వ్యక్తి.. అదిగో పులి తోక.. నేను ఆ ప్లేస్ లో చూశాను అని అంటే.. మళ్ళీ కొంత వ్యవధిలోనే అదే వ్యక్తికీ అక్కడ పులి ఉందని వార్త చేరుకుంటుంది. అంతగా పుకారు షికారు చేస్తాయి.. అవును అసలు నిజం కంటే.. పుకార్లు ఈజీగా షికారు చేస్తాయి. ఇంకా చెప్పాలంటే.. నిజం నడిచి వచ్చే లోపల.. అబద్ధం జెట్ స్పీడ్ లో పరిగెత్తుకుని వచ్చి అవతలివారి జీవితాన్ని అతకుతలం చేస్తుంది. భయబ్రాంతులకు గురి చేస్తుంది. అదే సమయంలో అవతలి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. మన జాగ్రత్తలో మనం ఉంటూ.. అత్యవసరం అయితే.. పరిస్థితులకు, సమాజానికి ఎదురు తిరిగే దైర్యం కలిగి ఉండాలి.. అది చాలా ముఖ్యం.. లేదంటే.. కొందరు మనస్తాపంతో తీసుకునే నిర్ణయాలు దారుణంగా ఉంటాయి. తాజాగా యువతి యువకులు సొంత అన్నాచెల్లెలుగా మెలుగుతున్నా.. వారిద్దరిపై ప్రేమికులంటూ ముద్ర వేయడంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఈ పుకార్లు ఇద్దరి ప్రాణాలు తీశాయి. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

పొరిగింటి పుల్లకురా రుచి అన్న సామెతను నిజం చేస్తూ.. మన సంగతి కంటే ఇతరులకు సంబంధించిన విషయాలపైనే ఆసక్తి ఎక్కువ జనాలకు.. పక్కవాడు వండుకునే కూర నుంచి ధరించే దుస్తులు.. జీతం, జీవితం అన్నింటిపైనా ఆసక్తిని.. చిన్న చిన్న విషయాలను కూడా ఎదో 8వ వింత అన్నచందంగా పుకారులు సృష్టిస్తారు. ముఖ్యంగా యువతి యువకులు కొంచెం చనువుగా ఉంటె.. వారిద్దరి మధ్య ఎదో ఉంటూ అంటూ మాట్లాడుకోవడం సర్వసాధారణంగా మారింది.. ఇలా నిజామాబాద్ కు చెందిన యువతీయువకులు కలిసి తిరిగితే ప్రేమికులని ముద్ర వేశారు. దీంతో ఆ యువతీ యువకులు మనస్థాపం తో ఆత్మహత్య చేసుకున్నారు. అంతేకాదు తాము అన్నాచెల్లెలుగా మెలుగుతున్న స్థానికులు మమ్మల్ని ప్రేమికులుగా ముద్ర వేసి బద్నాం చేసారని ఆవేదన వ్యక్తం చేశారు.. అంతేకాదు యువకుడు వినయ్ కుమార్ ఈ విషయాన్ని సూసైడ్ నాట్ లో  పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..