Raksha Bandhan: మహిళలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం.. మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
రక్షా బంధన్ సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఈరోజు రాష్ట్రంలో పలు ప్రభుత్వ పథకాల మహిళా లబ్ధిదారులతో మతామంతీ కార్యక్రమం నిర్వహించారు. కేంద్రప్రభుత్వం
KTR: తెలంగాణలో మహిళలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు ఉద్ఘాటించారు. రక్షా బంధన్ సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు రాష్ట్రంలో పలు ప్రభుత్వ పథకాల మహిళా లబ్ధిదారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మతామంతీ కార్యక్రమం నిర్వహించారు. అక్కా చెల్లెలందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి..కేంద్రప్రభుత్వం నిధులివ్వకపోయినా రాష్ట్రంంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పథకాలు తెలంగాణలో అమలవతున్నాయన్నారు. 33 జిల్లాలో 33 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని.. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్య పరిక్షలు చేస్తున్నామన్నారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని.. అంగన్వాడీ కార్యకర్తలను ఆదుకుంటున్నట్లు తెలిపారు.
తెలంగాణలో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించామన్నారు. 40వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్లిస్తూ..నీటి కోసం మమిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు వెళ్లాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకున్న ప్రభుత్వం తమదన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగానలో ఏర్పాటు చేస్తున్న ఆహార శుద్ధి పరిశ్రమతో పాటు.. మిగిలిన పరిశ్రమల కోసం ఏర్పాటు చేసే కారిడర్ లో మహిళలకు అవకాశం కల్పిస్తామన్నారు. 4లక్షలకు పైగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. బాలికల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు, గురుకుల కళాశాలలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. మన ఊరు మన బడి పేరుతో రూ.7,300 కోట్ల వ్యయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రయివేటు, కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..