Telangana: జీలకర్ర బెల్లం తంతు కూడా ముగిసింది.. మరికొద్ది క్షణాల్లో 3 ముళ్లు.. కట్ చేస్తే కల్లాస్

పెళ్లి మండపం కోలాహలంగా ఉంది. వచ్చిన అతిథులు, బంధుమిత్రులను పలకరించే పనిలో ఉన్నారు వధూవరులు కుటుంబ సభ్యులు. అంతలోనే ఊహించని సీన్...

Telangana: జీలకర్ర బెల్లం తంతు కూడా ముగిసింది.. మరికొద్ది క్షణాల్లో 3 ముళ్లు.. కట్ చేస్తే కల్లాస్
Groom Cheating
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 10, 2022 | 3:58 PM

Trending News: జీలకర్ర బెల్లం తంతు కూడా ముగిసిపోయింది. అంటే ఆల్మోస్ట్ పెళ్లి అయిపోయినట్లే. మరి కొద్ది నిమిషాల్లో తాళి కట్టాలి. అంతా సజావుగా సాగిపోతే.. ఓ జంట ఒకటయ్యేది. కానీ.. ఓ మహిళ ఎంట్రీతో ఆ పెళ్లికి వచ్చిన అతిథులు కంగుతిన్నారు. ఆమె అరుపులు, కేకలతో అక్కడ గందరగోళం నెలకుంది. కట్ చేస్తే.. తాళి కట్టు శుభ వేళ.. ఆ పెళ్లి ఆగి పోయింది. ఇదాంతా ఓ సినిమా షూటింగ్‌ లెవల్‌లో సాగిపోయింది. మంగళవాయిద్యాలు మోగాల్సిన.. ఆ పెళ్లి పందిట్లో ఘర్షణ వాతావరం ఏర్పడింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా(mancherial district) కేంద్రంలోని భీమాగార్డెన్‌లో జరిగింది. ఫంక్షన్‌ హాల్లో జరుగుతున్న పెళ్లి మధ్యలోనే ఆగి పోయింది. ముందుగా.. ఒక అమ్మాయికి అన్యాయం చేయడమే కాకుండా.. మరో అమ్మాయిని పెళ్లి పేరుతో అన్యాయం చేయబోయిన కన్నింగ్‌గాన్ని చితక బాదారు. పెళ్లి కూతురు తరుపున వచ్చిన వారంతా పెళ్లి కొడుకు రాజేష్‌ చెంపలు చెల్లు మనిపించారు. కొన్నాళ్లు ప్రేమ పేరుతో టైమ్‌ పాస్‌ చేసిన యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు ముహూర్తం పెట్టుకున్నాడు. ఇవాళ భీమా గార్డెన్‌లో ఘనంగా పెళ్లి జరుగుతుంది.

ఈ విషయం తెలుసుకొని.. బాధితురాలు ఫంక్షన్‌ హాల్‌కు చేరుకుంది. బలవంతంగా పెళ్లిని ఆపేసింది. అయితే.. ఒంటరిగా వచ్చిన మహిళను పెళ్లి కుమారుడి బంధువులు చితక బాదారు. ఆ తర్వాత పెళ్లి కూతురి బంధువులు వరుడి తాట తీశారు. పెళ్లి పేరుతో మోసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తోంది బాధితురాలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..