AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఆ అంశాలపై సీఎం కేసీఆర్ ఫోకస్..

రాష్ట్ర ఖజానాకు నిధులు సమకూర్చుకోవడంపై కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2022–23 బడ్జెట్‌లో ఏకంగా రూ.45 వేల కోట్లు లోటు ఏర్పడుతోంది. దీనిని పూడ్చుకునేందుకు సర్కార్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

CM KCR: ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఆ అంశాలపై సీఎం కేసీఆర్ ఫోకస్..
Cm Kcr
Shaik Madar Saheb
|

Updated on: Aug 11, 2022 | 7:41 AM

Share

Telangana Cabinet: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR) అధ్యక్షతన ఈ రోజు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ క్యాబినెట్‌ సమావేశం గురువారం (ఆగస్టు 11) మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానుంది. రాష్ట్రంలో నిధుల సమీకరణ, పథకాల అమలు, ప్రాజెక్టులు తదితర అంశాల ఎజెండాగా క్యాబినెట్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు నిధులు సమకూర్చుకోవడంపై కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2022–23 బడ్జెట్‌లో ఏకంగా రూ.45 వేల కోట్లు లోటు ఏర్పడుతోంది. దీనిని పూడ్చుకునేందుకు సర్కార్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ పరిస్థితుల్లో కేబినెట్ సమావేశం కీలక కానుంది. ముఖ్యంగా ఆదాయ వనరుల సమీకరణపైనే ప్రదాన చర్చ జరుగనుందని సమచారం. రుణ సమీకరణలో కేంద్రం సహాయనిరాకరణ, తెలంగాణ పట్ల వివక్షపై చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన సబ్‌కమిటీ సిఫార్సులను కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు.

కాగా.. ఆగస్టు 15 నుంచి కొత్తగా ఇస్తామన్న రూ.10 లక్షల పింఛన్లకు సంబంధించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం రెండో విడత అమలు, అవసరమైన నిధులు, ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులపై చర్చ జరగనుంది. మరోవైపు స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి ఒక రోజు శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 21న అసెంబ్లీ సమావేశం ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. నీటిపారుదల శాఖలో అడ్‌హక్‌ సీనియారిటీ రూల్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఇన్‌చార్జ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఇంజనీర్లకు రివర్షన్ల సమస్య నుంచి ఉపశమనం కల్పించడానికి వీలుగా 12 సూపర్‌న్యుమరరీ పోస్టుల సృష్టికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..