Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liver Cancer: గిన్నెలు కడిగేటప్పుడు ఇలాంటి తప్పులు చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త.. ‘క్యాన్సర్’ రావొచ్చు..

వంటగదిలో గిన్నెలు కడగడానికి డిటర్జెంట్ అప్లై చేసినప్పుడు శుభ్రమైన నీటితో కడగడం మర్చిపోవద్దు. ఈ డిటర్జెంట్ కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది.

Liver Cancer: గిన్నెలు కడిగేటప్పుడు ఇలాంటి తప్పులు చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త.. ‘క్యాన్సర్’ రావొచ్చు..
Liver Cancer
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 10, 2022 | 12:31 PM

Liver Cancer: దైనందన జీవితంలో సాధారణంగా మనం చేసే కొన్ని తప్పులు.. మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అలాంటి వాటిని ఎప్పుడూ కూడా విస్మరించకూడదు. వంటగదిలో గిన్నెలు కడగడానికి డిటర్జెంట్ అప్లై చేసినప్పుడు శుభ్రమైన నీటితో కడగడం మర్చిపోవద్దు. ఈ డిటర్జెంట్ కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. నివేదిక ప్రకారం.. డిటర్జెంట్‌లో హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇది కడుపులోకి ప్రవేశిస్తే కాలేయ క్యాన్సర్‌కు కారణం కావచ్చు. ఇంట్లోని కిచెన్ నుంచి కూడా క్యాన్సర్ శరీరంలోకి చేరుతోందని, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పాత్రలను సరిగ్గా శుభ్రపరచడంలో  అజాగ్రత్తగా ఉండకండి

‘ది సన్’ నివేదిక ప్రకారం వంటగదిలో పాత్రలు కడగడంలో అజాగ్రత్తగా ఉండేవారిలో క్యాన్సర్ ముప్పు నాలుగు రెట్లు పెరుగుతుందని పేర్కొంది. మనం గిన్నెలు కడగడానికి ఉపయోగించే సబ్బులు, డిటర్జెంట్లతో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. వాటిని ఉపయోగించిన తర్వాత శుభ్రంగా కడగడం చాలా ముఖ్యం. లేదంటే గిన్నెలు, గ్లాసులు, స్పూన్లు, ప్లేట్లు వంటి పాత్రల్లో అతుక్కుపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు లేదా పాత్రలలో నీరు తాగినప్పుడు ఆ రసాయన కణాలు మన శరీరంలోకి వెతాయి. దీంతో కాలేయ క్యాన్సర్‌కు దారితీసి శరీరానికి భారీ నష్టాన్ని కలిగిస్తాయి.

ఇవి కూడా చదవండి

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న లివర్ క్యాన్సర్ కేసులు

కాలేయ క్యాన్సర్‌పై పరిశోధన చేసిన డాక్టర్ జెస్సీ గుడ్రిచ్ ప్రకారం.. పరిశోధన కోసం 100 మందిని ఎంచుకున్నారు. వారిలో 50 మంది కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతుండగా, 50 మందికి అలాంటి సమస్య లేదు. అనంతరం ఇరు వర్గాలకు చెందిన వ్యక్తుల రక్త నమూనాలను సేకరించి పరీక్షించారు. లివర్ క్యాన్సర్ ఉన్నవారి శరీరంలో రసాయనాలు ఎక్కువగా ఉన్నట్లు అందులో తేలింది. పూర్తిగా శుభ్రం చేయని పాత్రలు, ఇతర కారణాల వల్ల ఈ రసాయనం మన శరీరంలోకి చేరి కాలేయంపై దాడి చేసినట్లు అధ్యయనంలో వెల్లడించారు.

శరీరంలోకి అనేక రకాల రసాయనాలు..

పరిశోధకుల ప్రకారం.. రసయనాలు శరీరంలోకి చేరిన తర్వాత అనేక విధాలుగా హాని కలిగిస్తాయి. ఇవి శరీరంలో గ్లూకోజ్ పని చేసే విధానాన్ని మారుస్తాయి. దీనితో పాటు కాలేయంలో అమైనో ఆమ్లాలు కూడా మారుతాయి. దీని కారణంగా కాలేయం చుట్టూ ఎక్కువ కొవ్వు ఏర్పడుతుంది. దీని కారణంగా ముందుగా ఫ్యాటీ లివర్, తరువాత కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం