Crime: 37 ఏళ్ల వ్యక్తితో పెళ్లికి సిద్ధమైన 15 ఏళ్ల బాలిక.. అడ్డొచ్చిన తల్లిదండ్రులను సుత్తి, కుక్కర్‌తో.. క్రూరాతి క్రూరంగా..

బాలిక, ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ఇంటినుంచి వెళుతుండగా.. తల్లిదండ్రులు అడ్డుకోవడంతో ఇద్దరూ కలిసి.. సుత్తి, ప్రెషర్ కుక్కర్‌తో మోది హత్య చేసినట్లు జంషేడ్‌పూర్ పోలీసులు మంగళవారం తెలిపారు.

Crime: 37 ఏళ్ల వ్యక్తితో పెళ్లికి సిద్ధమైన 15 ఏళ్ల బాలిక.. అడ్డొచ్చిన తల్లిదండ్రులను సుత్తి, కుక్కర్‌తో.. క్రూరాతి క్రూరంగా..
Jharkhand Cops
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 10, 2022 | 8:47 AM

Parents Murder: ఆ దంపతులు కూతురుని అల్లారు ముద్దుగా పెంచారు.. కానీ, ఆమె వారి పాలిట శాపంగా మారింది. ప్రేమ కోసం.. బాలిక (15) ప్రియుడితో కలిసి కన్న తల్లిదండ్రులనే దారుణంగా చంపింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లోని జంషేడ్‌పూర్లో కలకలం రేపింది. ఓ అమ్మాయి తన 37 ఏళ్ల ప్రియుడితో కలిసి తన తల్లిదండ్రులను ఘోరంగా చంపినట్లు పోలీసులు తెలిపారు. బాలిక, ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ఇంటినుంచి వెళుతుండగా.. తల్లిదండ్రులు అడ్డుకోవడంతో ఇద్దరూ కలిసి.. సుత్తి, ప్రెషర్ కుక్కర్‌తో మోది హత్య చేసినట్లు జంషేడ్‌పూర్ పోలీసులు మంగళవారం తెలిపారు. జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లా టెల్కో పోలీస్ స్టేషన్ పరిధిలోని మానిఫిట్‌లో ఈ ఘటన సోమవారం జరిగింది. ఇంట్లో సోమవారం రక్తపు మడుగులో దంపతులు పడి ఉండటాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రక్తపుమడుగులో ఉన్న దంపతులిద్దరూ తమ 15 ఏళ్ల కుమార్తె కనిపించకుండా పోయినట్లు వారు చివరిగా పేర్కొన్నట్లు తెలిపారు.

దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. మంగళవారం ఉదయం బిర్సానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓమ్‌నగర్‌లో బాలిక, ఆమె ప్రియుడిని పట్టుకున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ కె విజయ్ శంకర్ తెలిపారు. బాలిక ఆదివారం రాత్రి తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోబోతుండగా, ఆమె తల్లిదండ్రులు అడ్డుకున్నారని తెలిపారు. ఆమె తండ్రి (42), తల్లి (35) వారిని వెళ్లకుండా ఆపడంతో నిందితులు ఇద్దరూ సుత్తి, ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపారని అధికారి తెలిపారు. అనంతరం బాలిక తన ప్రియుడితో కలిసి స్కూటర్‌పై పారిపోయారు.

సుత్తి, రక్తంతో తడిసిన ప్రెషర్ కుక్కర్‌, స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 302 (హత్య) సహా ఐపిసిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం