Health Tips: చల్లగా ఉన్నా.. విపరీతమైన చెమట పడుతుందా..? అయితే.. మీరు ఆ సమస్యల బారిన పడినట్లే..

శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, శరీరం చల్లబరచడానికి చెమట పడుతుంది. కానీ కొన్నిసార్లు ఈ చెమట సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది.

Health Tips: చల్లగా ఉన్నా.. విపరీతమైన చెమట పడుతుందా..? అయితే.. మీరు ఆ సమస్యల బారిన పడినట్లే..
Sweating
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 09, 2022 | 8:02 AM

Cause Of Excessive Sweating: శరీరంలో చెమట సర్వసాధారణం.. చెమట అనేది.. మన చర్మంలో ఉంటే శ్వేధగ్రంధాల నుంచి విడుదలయ్యే శరీర ద్రవం.. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, శరీరం చల్లబరచడానికి చెమట పడుతుంది. కానీ కొన్నిసార్లు ఈ చెమట సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. వేడి, తేమతో కూడిన వాతావరణంలో ఉన్నప్పటికీ ప్రతి వ్యక్తి తీవ్రమైన చెమటతో ఇబ్బంది పడతారు. వ్యాయామం చేస్తున్నప్పుడు, ఎండలో నడిచేటప్పుడు చెమటలు పట్టడం సాధారణం. అయితే మీరు ఈ పరిస్థితులకు దూరంగా ఉన్నా.. చెమట పడితే దానిని తీవ్రంగా పరిగణించాలి. అవును, అధికంగా చెమట పట్టడం అనేది మీ శరీరంలో ఏదో లోపం ఉందని సూచిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఎక్కువగా చెమట పట్టడానికి గల కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతో వెంటనే చికిత్స తీసుకోవచ్చని పేర్కొంటున్నారు. ఎక్కువగా చెమట పట్టడానికి గల కారాణాలు.. వచ్చే వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకోండి..

అధిక చెమటతో ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం..

మధుమేహం – హైపోగ్లైసీమియా: ఒక వ్యక్తి తన శరీరంలో తగినంత గ్లూకోజ్ ఉత్పత్తి చేయనప్పుడు మధుమేహం వస్తుంది. గ్లూకోజ్ శరీరం, మెదడు శక్తికి ప్రధాన మూలం. కనుక ఇది తగినంత పరిమాణంలో లేకపోతే మీ శరీరం సరిగ్గా పనిచేయదు. మరోవైపు ఈ సమస్య ఉన్న వ్యక్తికి అవసరానికి మించి చెమట పడుతుంది. రాత్రిపూట చెమటలు పట్టడం వల్ల బెడ్షీట్లు లేదా దుస్తులు తేమగా మారుతాయి. అటువంటి పరిస్థితిలో చిరాకు లేదా గందరగోళం, అలసట లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

హైపర్ థైరాయిడిజం: థైరాయిడ్ గ్రంధి థైరాక్సిన్ అనే హార్మోన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసినప్పుడు హైపర్ థైరాయిడిజం ఏర్పడుతుంది. హైపర్ థైరాయిడిజంతో బాధపడుతుంటే బరువు తగ్గడంతో పాటు, వ్యక్తి వేడికి పెరిగిన సున్నితత్వాన్ని కూడా కలిగి ఉండవచ్చు. అంతే కాదు ఇలాంటి వ్యక్తికి తీవ్రమైన చెమటలు పడతాయి. ఆకలి కూడా పెరుగుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించి.. చికిత్స తీసుకోవడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదిస్తే.. పలు సమస్యల నుంచి బయటపడొచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లక్ చేయండి