Arvind Kejriwal: పేదలకో న్యాయం.. పెద్దలకో న్యాయమా..? కేంద్రంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఫైర్..

ఉచిత విద్య, వైద్యం, ప్రతి ఇంటికి 300 యూనిట్ల విద్యుత్‌, నిరుద్యోగ భృతిని అందించాలని సీఎం కేజ్రీవాల్ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.

Arvind Kejriwal: పేదలకో న్యాయం.. పెద్దలకో న్యాయమా..? కేంద్రంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఫైర్..
Arvind Kejriwal (File Photo)Image Credit source: TV9 Telugu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 09, 2022 | 6:48 AM

Arvind Kejriwal on Central government: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం కేంద్ర ప్రభుత్వంపై కొత్త విరుచుకుపడ్డారు. ఉచిత పథకాలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలకు.. కేజ్రీవాల్ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. విద్య, విద్యుత్‌, నీళ్లను ఉచితంగా ఇస్తే నేరమన్నట్టు చిత్రీకరిస్తున్నారంటూ మండిపడ్డారు. కేంద్రమంత్రులకు ఉచిత కరెంట్‌ ఎందుకనీ, ప్రజలకు ఉచిత్‌ విద్యుత్‌ ఇస్తే నష్టం ఏంటని నిలదీశారు. బడా వ్యాపారవేత్తల రూ.10 లక్షల కోట్ల బాకీల మాఫీపై ఎందుకు మాట్లాడరంటూ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. అలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణించి విచారణ జరపాలంటూ సూచించారు. భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. ఉచిత విద్య, వైద్యం, ప్రతి ఇంటికి 300 యూనిట్ల విద్యుత్‌, నిరుద్యోగ భృతిని అందించాలని సీఎం కేజ్రీవాల్ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ప్రధాన అంశాలను బలోపేతం చేయడానికి ప్రణాళికలు వేయకుండా, ఉచిత ప్రభుత్వ సంక్షేమ సేవలకు వ్యతిరేకంగా వాతావరణాన్ని సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు.

ఓట్ల కోసం ఉచితాలను అందించే సంస్కృతిని వీడనాడాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ గత నెలలో హెచ్చరించారు. ఇది దేశ అభివృద్ధికి చాలా ప్రమాదకరం అంటూ పేర్కొన్నారు. దీనికి కౌంటర్ ఇస్తూ సీఎం కేజ్రీవాల్ మాట్లాడారు. కాగా.. గుజరాత్‌పై ఎలాగైనా పట్టు బిగించాలని ప్రయత్నిస్తున్న ఆమ్‌ఆద్మీ అధినేత.. ముందస్తు వ్యూహాలతో దూసుకెళ్తున్నారు. గుజరాత్‌లో వరుస పర్యటనలు జరుపుతున్నారు. ముందస్తుగా పార్టీ అభ్యర్థుల ప్రకటనతో పాటే తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో స్పష్టంగా చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపిస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామన్న కేజ్రీవాల్ పలు హామీలు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..