Heart Health: పెరుగుతున్న గుండె సమస్యలు.. నివారించాలంటే వీటిని తప్పనిసరిగా తినండి..

గుండెపోటు సమయంలో సరైన చికిత్స పొందకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. గుండెపోటు ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు

Heart Health: పెరుగుతున్న గుండె సమస్యలు.. నివారించాలంటే వీటిని తప్పనిసరిగా తినండి..
Heart Health
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 08, 2022 | 2:08 PM

Food For Heart Health: ఉరుకుపరుగుల జీవితంలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. పెద్దలతోపాటు.. చిన్న వయస్సులో కూడా గుండె జబ్బులు, గుండెపోటు వంటి సమస్యలు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గుండెపోటు అనేది జీవితానికి పెనుముప్పుగా పరిణమించే సమస్య. గుండెపోటు సమయంలో సరైన చికిత్స పొందకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. గుండెపోటు ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. దీన్ని నివారించడానికి ముఖ్యంగా జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం ఉత్తమ మార్గం. కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా గుండెపోటు సమస్య నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే ఆహారపదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి..

నట్స్: రోజూ నట్స్ తినడం వల్ల గుండె జబ్బుల ముప్పు చాలా వరకు తగ్గుతుందని పేర్కొంటున్నారు. ఎందుకంటే గింజలలో అసంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, అమినో యాసిడ్‌లు ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి.

తృణధాన్యాలు: బ్రౌన్ రైస్, పాప్‌కార్న్ వంటి తృణధాన్యాల నుంచి తయారైన వస్తువులు గుండెకు చాలా మంచివిగా పరిగణిస్తారు. ఎందుకంటే వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

వెల్లుల్లి: వెల్లుల్లి ఏదైనా వంటకం రుచిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇందులో చాలా ముఖ్యమైన ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అయితే హృదయాన్ని మరింత ఆరోగ్యవంతంగా మార్చుకోవాలంటే వెల్లుల్లిని మీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

పప్పుదినుసులు: గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకున్నా.. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకున్నా తప్పనిసరిగా ఆహారంలో పప్పులను చేర్చుకోవాలి. పప్పుధాన్యాల వినియోగం గుండె ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా