Warts: ఒంటినిండా పులిపిర్లు అయ్యాయా? ఈ చిట్కాలను వాటికి శాశ్వతంగా చెక్ పెట్టండి..

Warts: చాలా మంది చర్మ సంబంధిత సమస్యలతో సతమతం అవుతుంటారు. అలాంటి సమస్యలలో పులిపుర్లు ఒకటి. ఇది చర్మంపై ఎక్కడపడితే అక్కడ వస్తుంటాయి.

Warts: ఒంటినిండా పులిపిర్లు అయ్యాయా? ఈ చిట్కాలను వాటికి శాశ్వతంగా చెక్ పెట్టండి..
Home Remedies For Rid Of Wa
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 08, 2022 | 1:41 PM

Warts: చాలా మంది చర్మ సంబంధిత సమస్యలతో సతమతం అవుతుంటారు. అలాంటి సమస్యలలో పులిపుర్లు ఒకటి. ఇది చర్మంపై ఎక్కడపడితే అక్కడ వస్తుంటాయి. ఇది సాధారణ సమస్యే అయినప్పటికీ.. చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ పులిపుర్లు హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే వైరస్ కారణంగా వస్తాయి. ఇవి ఎలాంటి నొప్పి కానీ, బాధ కానీ కలిగించవు. కానీ, అందవికారంగా ఉంటాయి. ముఖం, మెడ, చేతులు, కాళ్ల భాగం సహా.. ఎక్కడ పడితే అక్కడ ఇవి వస్తుంటాయి. అయితే, ఈ పులిపుర్లను తొలగించుకోవడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్‌లో లభించే ఖరీదైన కాస్మోటిక్స్ కూడా వాడుతారు. కొందరికి ఇవి ప్రభావం చూపితే.. మరికొందరు చూపవు. అయితే, ఈ పులిపుర్లను తొలగించుకోవడానికి ఆయుర్వేదం ప్రకారం అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా మన ఇళ్లలో వినియోగించే కొన్ని వస్తువులు వీటిని తొలగించడంలో అద్భుతంగా పని చేస్తాయి. మరి పులిపుర్ల సమస్యను సహజ సిద్ధంగా తొలగించుకోవడం ఎలా? ఆ ప్రభావవంతమైన చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఒక గిన్నెలో ఒక అర టీ స్పూన్ తెల్లని టూత్ పేస్ట్ ను తీసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ ఆముదం నూనెను, అర టీ స్పూన్ వంటసోడాను వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు పులిపిర్ల మీద రాసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల పులిపుర్లు త్వరలోనే తగ్గుతాయి.

2. తమలపాకు, తడి సున్నంతో పులిపుర్లను తొలగించుకోవచ్చు. ముందుగా తాజా తమలపాకును కాడతో సహా తీసుకోవాలి. దాని కాడను ఆకు నుండి వేరు చేయాలి. ఇలా వేరు చేసిన కాడతో తడి సున్నాన్ని తీసుకుని పులిపిర్ల మీద రాసి అదే కాడతో వాటిపై 3 నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం త్వరలోనే పులిపిర్లు నయం అవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..