ATM Card Rules: మీ డెబిట్ కార్డ్ పోయిందా? వెంటనే ఇలా చేయండి..

ATM Card Rules: ప్రస్తుతం కాలంలో పేమెంట్స్ అన్నీ డిజిటిల్ ద్వారానే సాగుతున్నాయి. అదే సమయంలో చాలా మంది డెబిట్ కార్డుపై ఆధారపడి..

ATM Card Rules: మీ డెబిట్ కార్డ్ పోయిందా? వెంటనే ఇలా చేయండి..
Debit Card
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 06, 2022 | 8:01 PM

ATM Card Rules: ప్రస్తుతం కాలంలో పేమెంట్స్ అన్నీ డిజిటిల్ ద్వారానే సాగుతున్నాయి. అదే సమయంలో చాలా మంది డెబిట్ కార్డుపై ఆధారపడి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. కాలం గడిచే కొద్దీ టెక్నాలజీ ఆధారిత లావాదేవీలు పెరుగుతున్నాయి. చేతిలో పెద్దగా నగదు లేకపోయినా..వాలెట్‌లో డెబిట్ కార్డ్ ఉంటే సరిపోతుంది. సమీపంలోని ఏటీఎంకు వెళ్లి.. ఇట్టే డబ్బు తీసుకోవచ్చు. అలాగే వివిధ ఆన్‌లైన్ చెల్లింపులకు డెబిట్ కార్డ్ తప్పనిసరి. అందుకే అన్ని వయసుల వారిలోనూ డెబిట్ కార్డులను ఉపయోగించే ట్రెండ్ చాలా ఎక్కువ. అయితే, ఇంతటి ముఖ్యమైన డెబిట్ కార్డు పోతే? పరిస్థితి ఏంటనేది చాలా మందిలో మెదిలే ప్రశ్న. ఒకవేళ డెబిట్ కార్డు పోతే.. అది కూడా క్రిమినల్స్ చేతికి చిక్కితే.. చాలా కోల్పోవాల్సి వస్తుంది. అందుకే, డెబిట్ కార్డు పోయినా, చోరీకి గురైనా వెంటనే చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవి చేయకపోతే.. అకౌంట్‌లో డబ్బును కోల్పోవాల్సి వస్తుంది. మరి డెబిట్ కార్డు పోతే ముందుగా చేయాల్సిన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. కార్డు పోయిన వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి. లేదంటే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. సమీపంలోని బ్యాంక్‌కు వెళ్లి అయినా, బ్యాంక్ హెల్ప్ లైన్‌ నెంబర్‌కు కాల్ చేసి అయినా వివరాలను తెలియజేయాలి.

2. డెబిట్ కార్డు పోతే.. బ్లాక్ చేయించాలి. బ్యాంక్ పోర్టల్ నంచి అయినా, కస్టమర్ కేర్‌కు కాల్ చేసినా అయినా సరే బ్లాక్ చేయించాలి. కార్డ్ బ్లాక్ చేయడం వలన మీ ఖాతాలోని సొమ్ము సేఫ్‌గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

3. మీ డెబిట్ కార్డును ఎవరైనా కాజేసినట్లు అనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి. పీఎస్‌లో ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అనంతరం బ్యాంకులో కంప్లైంట్ ఇచ్చి బ్లాక్ చేయించాలి.

4. డెబిట్ కార్డ్ పోయినా, దొంగిలించబడినా వెంటనే బ్యాంక్‌కి తెలియజేయకపోతే.. నష్టపోవాల్సి వస్తుంది. ఒకవేళ దుండగులు డబ్బులు కాజేస్తే.. దానికి బ్యాంకు బాధ్యత వహించదు. అందుకే కార్డు పోయిన వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం అందించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..