AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సీసీ కెమెరాను కనిపెట్టిన గుడ్లగూబ.. ఆ తరువాత ఏం చేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: సాధారణంగా అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు సీసీ కెమెరా వంటి ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇంకొన్ని..

Viral Video: సీసీ కెమెరాను కనిపెట్టిన గుడ్లగూబ.. ఆ తరువాత ఏం చేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!
Owl
Shiva Prajapati
|

Updated on: Aug 05, 2022 | 9:57 PM

Share

Viral Video: సాధారణంగా అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు సీసీ కెమెరా వంటి ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇంకొన్ని చోట్ల జంతు ప్రేమికులు.. జంతువులు, పక్షుల ఫోటోలను తీసేందుకు రహస్యంగా కెమెరాలను పెడతారు. వాటి ముందుకు జంతువులు, పక్షులు వచ్చినప్పుడు ఆటోమాటిక్‌గా ఫోటోలు తీస్తాయి. ఈ కెమెరాలకు కొన్నిసార్లు అందమైన దృశ్యాలు చిక్కుతాయి. అలాంటి దృశ్యమే ఓ కెమెరాకు చిక్కింది. మూడు గుడ్లగూబలు కెమెరా కంటికి చిక్కాయి. ఆ మూడూ స్నేహితుల్లా కలిసిమెలిసి ఉన్నాయి. ఇంతలో ఓ గుడ్లగూబ.. కెమెరాను గుర్తించింది. నేరుగా కెమెరా వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చింది.

కెమెరా ముందు నిల్చున్న గుడ్లగూబ.. ఏదో తేడాగా ఉందే అనకుంటూ అటూ ఇటూ తిరుగుతూ చూసింది. తన పెద్ద కళ్లను మరింత పెద్దగా చేసి ఆ కెమెరాను పరికించి చూసింది. తల కిందకు, పైకి, రౌండ్‌గా తిప్పుడూ వించ చేష్టలు చేసింది. తన రెక్కలను విప్పి మరీ ఇక్కడ ఏదో ఉందన్నట్లు పరిశీలించింది చూసింది గుడ్లగూబ. దాని ప్రవర్తన అంతా కెమెరాలో రికార్డ్ అయ్యింది. చూడటానికి ఫన్నీగా ఉన్న దృశ్యాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. @Animal_WorId పేరుతో ఉన్న ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. కెమెరా ముందు ఆ గుడ్లగూబ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరెందుకు ఆలస్యం ఈ క్యూట్ వీడియోను ఇప్పుడే చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు
ఆకాష్ దీప్ కోసం అంత త్యాగం చేసిన అమ్మాయి ఎవరంటే ?
ఆకాష్ దీప్ కోసం అంత త్యాగం చేసిన అమ్మాయి ఎవరంటే ?
పెళ్లయిన మూడు రోజులకే ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్.. ఏమైందంటే?
పెళ్లయిన మూడు రోజులకే ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్.. ఏమైందంటే?
అబ్బా సాయిరాం.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
అబ్బా సాయిరాం.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
మరికాసేపట్లో SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు.. లింక్
మరికాసేపట్లో SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు.. లింక్
జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?
జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?