Viral Video: కోడిని గెంటేసి గుడ్లపై పొదిగిన పిల్లి.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు భయ్యా..!

Viral Video: సాధారణంగా పక్షులు, కొన్ని రకాల సరిసృపాలు గుడ్లు పెడతాయి. పక్షులు అయితే పిల్లల కోసం గుడ్లపై పొదుగుతాయి. అలా పొదిగితేనే ఆ గుడ్ల నుంచి పిల్లలు జన్మిస్తాయి.

Viral Video: కోడిని గెంటేసి గుడ్లపై పొదిగిన పిల్లి.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు భయ్యా..!
Cat
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 04, 2022 | 8:19 PM

Viral Video: సాధారణంగా పక్షులు, కొన్ని రకాల సరిసృపాలు గుడ్లు పెడతాయి. పక్షులు అయితే పిల్లల కోసం గుడ్లపై పొదుగుతాయి. అలా పొదిగితేనే ఆ గుడ్ల నుంచి పిల్లలు జన్మిస్తాయి. లేదంటే.. ఆ గుడ్లు పాడైపోతాయి. కోడి గుడ్లను పొదిగేయడం మనం చూసే ఉంటాం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, తాజాగా ఓ వీడియోలో కనిపించిన దృశ్యం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ దృశ్యం చూసి షాక్ అవడంతో పాటు.. ఇదేంట్రా బాబూ ఇలా తయారయ్యింది అంటూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే.. కోడి పొదగాల్సిన స్థానంలో పిల్లి పొదిగింది. అవును.. మీరు చదవింది నిజంగా నిజం. కోడిగుడ్లపై పిల్లి పొదిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు బిత్తర పోతున్నారు.

ఈ వైరల్ వీడియోలో ఓ కోడిపెట్ట గుడ్లపై పొదిగింది. అయితే, ఆకలేయడంతో అది కాసేపు అలా బయటకు వెళ్లింది. ఇదే ఛాన్స్‌గా భావించిందో ఏమో గానీ.. పిల్లి వచ్చి ఆ గుడ్లపై హాయిగా పొదిగింది. కాసేపటి తరువాత కోడి రాగా.. పిల్లి దర్శనిమిచ్చింది. దాంతో ఏం చేయాలో పాలుబోక.. ఆ కోడి తన గుడ్ల చుట్టూ బిక్క మొహం వేసుకుని తిరుగుతోంది. ఇంతలో ఇంటి యజమానికి వచ్చి ఆ పిల్లిని కదిలించగా.. దాని కింద గుడ్లు సేఫ్‌గా కనిపించాయి. ఆ పిల్లిని పక్కకు నెట్టిన కదలకుండా గుడ్లపై పొదిగి ఉంటుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 2 మిలియన్ల మంది వీక్షించగా.. 67 వేల లైక్స్ వచ్చాయి. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోపై ఓ లుక్కేసుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..