Viral Video: బాహుబలి యుద్ధాన్ని మించిన కోతుల యుద్ధం.. వందలాది వానరాలు ఒకేసారిగా..!

Viral Video: వనాలు తగ్గుతుండటంతో వానరాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఆకలితో ఆహారం కోసం గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి తిష్టవేస్తున్నాయి.

Viral Video: బాహుబలి యుద్ధాన్ని మించిన కోతుల యుద్ధం.. వందలాది వానరాలు ఒకేసారిగా..!
Monkeys
Follow us

|

Updated on: Aug 02, 2022 | 8:02 PM

Viral Video: వనాలు తగ్గుతుండటంతో వానరాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఆకలితో ఆహారం కోసం గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి తిష్టవేస్తున్నాయి. ఏది దొరికితే అది తినేస్తున్నాయి. అంతటితో ఆగితే బాగుండేది కానీ, రౌడీల్లా మారిపోతున్నాయి. ఇళ్లలోకి దూరి మరీ ఏది దొరికితే అది ఎత్తుకెళ్తున్నాయి. ఒక్కోసారి మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఒకటి రెండు కోతులు అయితే భయపడాల్సిన పనిలేదు.. కానీ, వందలాది కోతులు మందలు మందలుగా వచి జనావాసాలపై ఎగబడుతుండటమే ఆందోళన కలిగిస్తోంది.

కోతుల గ్యాంగ్ వార్.. సాధారణంగా మనుషుల గ్యాంగ్ వార్ గురించి విన్నాము.. చూశాము. కానీ, కోతుల గ్యాంగ్ వార్ గురించి ఎప్పుడైనా చూశారా? పోనీ విన్నారా? ఏదీ కాదంటూ ఇప్పుడు చూసేయండి. పదుల సంఖ్యలో కాదు.. వందల సంఖ్యలో గుమిగూడిన కోతుల మంద, గ్రూపులుగా ఏర్పడి చిన్నపాటి యుద్ధమే చేశాయి. వందలాది వానరాలు ఒకే చోట గుమిగూడి, రెండు వర్గాలుగా విడిపోయాయి. అనంతరం రెండు గ్రూపుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఒకదానిపై ఒకటిగా రెండు గ్రూపుల కోతులు దాడులు చేసుకున్నాయి. దాదాపు మూడు గంటల పాటు కోతుల గుంపు కొట్టుకుంది. ఈ సన్నివేశం చూసిన స్థానికులు భయంతో హడలిపోయారు. ఇళ్లకు తలుపులు వేసుకుని.. కిటికీలోంచి వాటి యుద్ధాన్ని వీక్షించారు. కోతుల గొడవను కొందరు ధైర్యం చేసి తమ సెల్ ఫోన్లలో వీడియో చిత్రీకరించారు. కాగా, ఈ విచిత్ర ఘటన మహబూబాబాద్ జిల్లాలోని పెద్దవంగర గ్రామంలో చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..