Top 10 Earphones: ఇయర్‌ఫోన్స్ కొనాలనుకుంటున్నారా? రూ. 500 లోపు టాప్ 10 ఇయర్ ఫోన్స్ ఇవే..

Top 10 Earphones: మీరు ల్యాప్‌టాప్/స్మార్ట్‌ఫోన్/టాబ్‌లెట్‌ ఏది ఉపయోగించినా.. ఏదో సందర్భంలో ఇయర్ ఫోన్స్ అవసరం పడుతుంది.

Top 10 Earphones: ఇయర్‌ఫోన్స్ కొనాలనుకుంటున్నారా? రూ. 500 లోపు టాప్ 10 ఇయర్ ఫోన్స్ ఇవే..
Earphones
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 01, 2022 | 7:38 PM

Top 10 Earphones: మీరు ల్యాప్‌టాప్/స్మార్ట్‌ఫోన్/టాబ్‌లెట్‌ ఏది ఉపయోగించినా.. ఏదో సందర్భంలో ఇయర్ ఫోన్స్ అవసరం పడుతుంది. ఇయర్ ఫోన్స్‌కు మార్కెట్‌లో రకరకాల ధరలు ఉంటాయి. అయితే, చాలా మంది తక్కువ ధరకు నాణ్యమైన ఇయర్ ఫోన్స్ కావాలని కోరకుంటారు. ఆ దిశగా సెర్చ్ చేస్తుంటారు. మరికొందరికి వెతికే తీరిక లేక.. ఏదో ఒకటి అని కునుగోలు చేసేస్తారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రస్తుతం వైర్‌లెస్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలా మంది వైర్డ్ ఇయర్ ఫోన్స్ నే వాడుతుంటారు. ఈ నేపథ్యంలోనే రూ. 500 కంటే తక్కువ ధర కలిగిన ఇయర్ ఫోన్‌ల వివరాలను ఇక్కడ అందించడం జరుగుతుంది. అవేంటో ఓ లుక్కేసుకోండి..

1. Boat Bassheads 242 : బోట్ బాస్ హెడ్స్ 242 వైర్డ్ హెడ్‌సెట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 449 లుగా ఉంది. ఇయర్‌ఫోన్‌లో మైక్, సురక్షితమైన ఫిట్ ఇయర్ హుక్స్, 10mm డ్రైవర్లు, IPX4 స్వెట్(చెమట), వాటర్ రిసిస్టెంట్. టైప్ 3.5 మిమీ కనెక్టర్.

2. Boat Bassheads 100: బోట్ బాస్ హెడ్స్ 100 వైర్డ్ హెడ్‌సెట్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 299 లకే అందుబాటులో ఉంది. ఇది మైక్, హాక్-ప్రేరేపిత డిజైన్, ఇన్-లైన్ మైక్రోఫోన్, ఇంటిగ్రల్ మల్టీఫంక్షనల్ కంట్రోల్. టైప్ 3.5 మిమీ కనెక్టర్.

ఇవి కూడా చదవండి

3. Boat Bassheads 103: ఈ హెడ్‌సెట్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 499 లకే అందుబాటులో ఉంది. దీనిలోని ఫీచర్స్.. మైక్, ఇమ్మర్సివ్ ఆడియో, లైట్ వెయిట్ అడాప్టివ్ డిజైన్, మాగ్నెటిక్ ఇయర్‌బడ్స్, ఇంటిగ్రల్ మల్టీఫంక్షనల్ కంట్రోల్, బిల్ట్-ఇన్ మైక్రోఫోన్. టైప్ 3.5 మిమీ కనెక్టర్.

4. Boat Bassheads 102: ఈ వైర్డ్ ఇయర్‌ఫోన్‌ల ధర Amazonలో కేవలం రూ. 349 లకే అందుబాటులో ఉంది. ఇయర్‌ఫోన్‌ ఫీచర్స్.. 3.5ఎమ్ఎమ్ గోల్డ్ ప్లేటెడ్ జాక్, పాసివ్ నాయిస్ ఐసోలేషన్, లైట్ వెయిట్ అడాప్టివ్ డిజైన్, ఇమ్మర్సివ్ ఆడియో, ఇంటిగ్రేటెడ్ మల్టీ-ఫంక్షన్ కంట్రోల్‌తో ఇన్-లైన్ మైక్.

5. Realme Buds Classic: ఈ ఇయర్‌ఫోన్స్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 399 మాత్రమే. దీని ఫీచర్లలో హాఫ్ ఇన్-ఇయర్ డిజైన్, హెచ్‌డి మైక్రోఫోన్, కేబుల్ ఆర్గనైజర్, సింగిల్ బటన్ రిమోట్. కనెక్టర్ టైప్ 3.5 మిమీ.

6. Boult Audio Bassbuds Loop: ఈ వైర్డ్ హెడ్‌సెట్ మైక్, సర్దుబాటు చేయగల ఇయర్ లూప్, నాయిస్ ఫ్రీ వంటి ముఖ్యమైన లక్షణాలను కలిగి ఉంది. కనెక్టర్ టైప్ 3.5 మిమీ. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఇయర్‌ఫోన్‌ల ధర కేవలం రూ.349 మాత్రమే.

7. Mivi Rock Roll E5: ఇది ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 299 లకే అందుబాటులో ఉంది. మైక్, అడిషనల్ పవర్‌ఫుల్ బేస్, ఇతర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కనెక్టర్ టైప్ 3.5 మిమీ.

8. Philips SHE1505: ఈ వైర్డ్-ఇన్-ఇయర్ ఇయర్‌ఫోన్‌లు మైక్, రిచ్ బాస్ కోసం 10 mm డ్రైవర్‌లు, క్లియర్ సౌండ్, పరస్పరం మార్చుకోగల ఇయర్ టిప్స్ వంటి ముఖ్యమైన ఫీచర్‌లు కలిగి ఉన్నాయి. కనెక్టర్ టైప్ 3.5 మిమీ. అమెజాన్‌లో ఈ ఇయర్‌ఫోన్‌ల ధర కేవలం రూ.299 మాత్రమే.

9. JBL C50HI: ఈ వైర్డ్ హెడ్‌ఫోన్‌ల ధర అమెజాన్‌లో కేవలం రూ. 499. ఇయర్‌ఫోన్‌లు వన్ బటన్ రిమోట్ మైక్రోఫోన్, 3.5mm జాక్‌తో పాటు డైనమిక్, స్పష్టమైన ధ్వనిని అందిస్తుంది. వాయిస్ అసిస్టెంట్‌ సపోర్ట్ కూడా ఉంది.

10. Boult Audio BassBuds X1: ఇన్-ఇయర్ వైర్డ్ ఇయర్‌ఫోన్‌లు 10mm అడిషనల్ బాస్ డ్రైవర్‌తో అమెజాన్/ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 329 ధరకే లభిస్తాయి. అద్భుతమైన సౌండ్‌ని అందిస్తాయి. ఈ ఇయర్‌ఫోన్‌లలో అందుబాటులో ఉన్న ఇతర ఫీచర్లు.. ఇన్‌లైన్ కంట్రోల్, IPX5, వాయిస్ అసిస్టెంట్, కంఫర్ట్ ఫిట్ మొదలైనవి.

గమనిక: పైన పేర్కొన్న గాడ్జెట్‌ల ధరలు మారవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..