AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Friendship: చావుబ్రతుకుల మధ్య స్నేహితుడు.. ఫ్రెండ్‌షిప్‌బ్యాండ్ కట్టిన స్నేహితులు.. హృదయాన్ని పిండేసే సీన్..

Karnataka: స్నేహితుల దినోత్సవం రోజున ప్రతీ ఒక్కరూ తమ స్నేహితుడికి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టి.. తమ స్నేహాన్ని వ్యక్తం చేస్తారు.

Friendship: చావుబ్రతుకుల మధ్య స్నేహితుడు.. ఫ్రెండ్‌షిప్‌బ్యాండ్ కట్టిన స్నేహితులు.. హృదయాన్ని పిండేసే సీన్..
Friendship Band
Shiva Prajapati
|

Updated on: Aug 01, 2022 | 7:20 AM

Share

Karnataka: స్నేహితుల దినోత్సవం రోజున ప్రతీ ఒక్కరూ తమ స్నేహితుడికి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టి.. తమ స్నేహాన్ని వ్యక్తం చేస్తారు. స్నేహానికి వయసుతో పని లేదు. జస్ట్ ఒక్క పరిచయం చాలు. మాటా మాటా కలిస్తే ఆటోమాటిక్ గా స్నేహం కుదిరిపోతుంది. అయితే, ఇక్కడ హృదయాన్ని పిండేసే సంఘటన చోటు చేసుకుంది. ప్రాణాల కోసం మృత్యువుతో పోరాడుతున్న ఓ బాలుడు.. ఆస్పత్రికి వెళ్లే ముందు తనను ఒక్కసారి స్నేహితుల వద్దకు తీసుకెళ్లాలని, వారిని చూడాలని కోరడం కన్నీరు పెట్టిస్తుంది. అతని కోరిక మేరకు తల్లిదండ్రులు అతన్ని పాఠశాలకు తీసుకురాగా, స్నేహితులంతా అతనికి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టారు. తమ మిత్రుడు క్షేమంగా తిరిగి రావాలని, తమతో మళ్లీ మునుపటిలా ఆడుకోవాలని ఆకాంక్షిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ సన్నివేశం హృదయాలను పిండేస్తుంది.

కర్ణాటక రాష్ట్రంలోని కరటగి కి చెందిన సుహాస్ సౌద్రి.. స్థానిక కేంబ్రిడ్జి పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నాడు. స్కూల్‌లో అందరితోనూ స్నేహంగా మెలిగేవాడు. సుహాస్‌కి టీచర్లతోనూ మంచి బంధం ఉండేది. అంతేకాదు..సుహాస్ స్టడీలో ఫస్ట్ ఉండేవాడు. దాంతో సహజంగా అందరూ సుహాస్‌తో సరదాగా ఉండేవారు.

ఇంతకీ ఏం జరిగింది? సుహాస్‌కు పుట్టినప్పటి నుంచి కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య ఉంది. గత నెల రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సుహాస్ అర్థరాత్రి మృతి చెందాడు. అయితే అంతకు ముందు.. తీవ్ర అస్వస్థతకు గురైనప్పటికీ, సుహాస్ తన పాఠశాలను, ఉపాధ్యాయులను, స్నేహితులను గుర్తు చేసుకున్నాడు. వారిని కలవరించాడు. దాంతో సుహాస్‌ను తల్లిదండ్రులు పాఠశాలకు తీసుకొచ్చారు. ఈ సమయంలో ఆటోలోనే అపస్మారక స్థితిలో ఉన్న సుహాస్‌ ను చూసి స్నేహితులు, స్కూల్ టీచర్స్ కన్నీటిపర్యంతం అయ్యారు. సుహాస్‌కు ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ కట్టి వీడ్కోలు పలికారు. తను క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. కానీ విధి వంచించింది. అదే రోజు రాత్రి ప్రాణాలు విడిచాడు సుహాస్. ఈ ఘటన అందరి గుండెలను పిండేస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..