AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: మీ ప్రత్యర్థులపై పైచేయి సాధించాలనుకుంటున్నారా? ముందుగా వీటిని గుర్తించండి..!

Chanakya Niti: ప్రపంచంలో మనుషులు అనేక రకాలుగా ఉంటారు. వారి ధోరణి కూడా భిన్నంగా ఉంటుంది. మనుషుల మనస్తత్వాలను..

Chanakya Niti: మీ ప్రత్యర్థులపై పైచేయి సాధించాలనుకుంటున్నారా? ముందుగా వీటిని గుర్తించండి..!
Chanakya Niti Rules Main
Shiva Prajapati
|

Updated on: Aug 01, 2022 | 6:00 AM

Share

Chanakya Niti: ప్రపంచంలో మనుషులు అనేక రకాలుగా ఉంటారు. వారి ధోరణి కూడా భిన్నంగా ఉంటుంది. మనుషుల మనస్తత్వాలను ఆచార్య చాణక్య తన నీతిశాస్త్రంలో చాలా వివరంగా పేర్కొన్నారు. ముఖ్యంగా ఎవరినైనా తమ వైపునకు తిప్పుకోవడం ఎలాగో కూడా వివరించారు. కొన్ని కొన్ని సార్లు ఒకరికి మరొకరి సాయం అవసరం పడుతుంది. అయితే, కొందరు సపోర్ట్ ఇస్తారు. కొందరు ఇవ్వరు. అలాంటప్పుడు వారిని తమ వైపునకు తిప్పుకోవాల్సి వస్తుంది. ఇది జరగాలంటే.. సదరు వ్యక్తులు దేనికి ఆకర్షితులవుతారో తెలుసుకోవాలి. దాన్ని అర్థం చేసుకుంటే.. ఎవరినైనా సులభంగా నియంత్రించవచ్చు. అలాంటి 4 రకాల వ్యక్తుల గురించి మనం ఇవాళ తెలుసుకుందాం..

1. అత్యాశపరులు: అత్యాశ కలిగిన వ్యక్తులు డబ్బు కోసం దేనికైనా సిద్ధపడుతారు. అత్యాశగల వ్యక్తి బలహీనత డబ్బు. అలాంటి వ్యక్తి ముందు డబ్బుకు సంబంధించిన ప్రపోజల్ పెట్టాలి. అలా చేస్తే.. మీరు ఏం చెప్పినా వింటారు.

2. కోపిష్టి: అధిక కోపం కలిగిన వ్యక్తుల ముందు.. మీరు కూడా కోపం తెచ్చుకుంటే పరిస్థితులు మరింత దిగజారుతాయి. అలా చేస్తే వారు మీకు శత్రువు అవుతారు. కోపం ఉన్న వ్యక్తిని సహనం ఉన్న మాత్రమే నియంత్రించగలడు. ఎదుటి వారు కోపంగా ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి. వారి కోపం తగ్గిన తరువాత.. మీ అభిప్రాయాన్ని ప్రశాంతంగా వివరించాలి. అప్పుడు వారి మీ మాటలను వింటారు.

3. ప్రశంసలు కోరుకునేవారు: కొంతమందికి పొగడ్తలు అంటే చాలా ఇష్టం. నిత్యం తమను ప్రశంసించాలని కోరుకుంటారు. అలాంటి వ్యక్తులు ప్రశంసలు విన్న తరువాత తమను తాము మరింత గొప్పగా భావిస్తుంటారు. అలాంటి సమయంలో వారిని పొడిగి.. ఆ తరువాత వారికి ఏం చెప్పినా వింటారు. ప్రస్తుత కాలంలో నడిచేదంతా ఇదే.

4. తెలివైన వారు: ప్రపంచంలో అత్యంత కష్టతరమైన పని వీరిని నియంత్రించడం. తెలివైన వారికి మంచి చెడు పట్ల అవగాహన ఉంటుంది. వారిని లోబరుచుకోవడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో, ఎవరు చేయడం లేదో ఈజీగా అర్థం చేసుకుంటారు. వీరిని సత్యం ద్వారా మాత్రమే నియంత్రించగలరు. నిజం చెప్పే వారినే వారు విశ్వసిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..