Hyderabad: చుట్టపుచూపుగా వచ్చి తనువుచాలించాడు.. స్విమ్మింగ్‌ పూల్‌లో పడి విద్యార్థి మృతి..

చుట్టపుచూపుగా బంధువుల ఇంటికి వచ్చాడు. కానీ, ఊహించనివిధంగా స్విమ్మింగ్‌ పూల్‌లోపడి చనిపోయాడు. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.

Hyderabad: చుట్టపుచూపుగా వచ్చి తనువుచాలించాడు.. స్విమ్మింగ్‌ పూల్‌లో పడి విద్యార్థి మృతి..
Hyderabad
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 01, 2022 | 5:58 AM

Hyderabad Swimming Pool Death: హైదరాబాద్‌లో మరో బాలుడు స్విమ్మింగ్‌ పూల్‌కి బలైపోయాడు. కోకాపేటలో ఈ ట్రాజెడీ ఇన్సిడెంట్‌ జరిగింది. స్విమ్మింగ్‌ పూల్‌లో పడి తొమ్మిదో తరగతి విద్యార్ధి లంకా శ్యామ్ మృత్యువాత పడ్డాడు. బంధువుల ఇంటికి చుట్టపుచూపుగా ఇచ్చిన శ్యామ్‌, ఊహించనివిధంగా స్విమ్మింగ్‌పూల్‌లో చనిపోయాడు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చిన శ్యామ్‌ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి నార్సింగ్‌ కోకాపేట్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌కి వచ్చారు. అయితే, శ్యామ్‌కు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. గుర్తించిన స్విమ్మింగ్‌ పూల్‌ నిర్వాహకులు, బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే నీటిని మింగేసి అస్వస్థతకు గురైన శ్యామ్‌, చికిత్స పొందుతూ మరణించాడు. బంధువుల ఇంటికి చుట్టపుచూపుగా ఇలా మృత్యువాత పడటంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

అయితే, స్విమ్మింగ్‌ పూల్‌ నిర్వాహకులపై బాధిత కుటుంబం కంప్లైంట్‌తో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గర సరైన సౌకర్యాలు లేకపోవడంతోనే తమ కుమారుడు చనిపోయాడని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. హైదరాబాద్‌ నాగోల్‌లో రీసెంట్‌గా ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. పదేళ్ల బాలుడు మనోజ్‌ కూడా ఇదే తరహాలో స్విమ్మింగ్‌ పూల్‌లో మునిగి చనిపోయాడు.

లింగంపల్లిలోని అమ్మమ్మ ఇంటికొచ్చిన మనోజ్‌, ఇంటి దగ్గర్లోని స్విమ్మింగ్‌ పూల్‌తో ఈతకు దిగి మృత్యువాత పడ్డాడు. ఈ స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గర కూడా సరైన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మనోజ్‌ మరణించాడని కంప్లైంట్‌ చేయడంతో నిర్వాహకుడు అశోక్‌ను అరెస్ట్‌ చేశారు. మరి, శ్యామ్‌ ఇన్సిడెంట్‌లో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..