Hyderabad: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతి..
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం రేపాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో రియల్ ఎస్టెట్ వ్యాపారి మృతి చెందాడు. నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీరూప్ వద్ద సోమవారం తెల్లవారుజామున
Hyderabad Realtor shot dead: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం రేపాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో రియల్ ఎస్టెట్ వ్యాపారి మృతి చెందాడు. నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీరూప్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సంఘటనా స్థలం నుంచి బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు. నీరూస్ వద్ద రౌడీషీటర్ల మధ్య కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు కాలాపత్తర్ కు చెందిన రౌడీషీటర్ ఇస్మాయిల్ గా గుర్తించారు. ఇస్మాయిల్ పై కాల్పులు జరిపింది ముజాహిద్ గా పేర్కొంటున్నారు.
కాగా నిందితులు బైక్ పై వచ్చి కారులో ఉన్న ఇస్మాయిల్ పై పాయింట్ బ్లాంక్ లో ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. కాగా పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపుచర్యలు మొదలుపెట్టారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీం తో పర్యవేక్షిస్తున్నారు. కాగా రియల్ ఎస్టేట్ వివాదాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.