CV Anand: మా ఇంటి సమీపంలో సౌండ్ పొల్యుషన్.. డయల్ 100కు సామాన్యుడిలా సీపీ కాల్..
Hyderabad CP: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నుంచి డయల్ 100కు కాల్ రావడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. సామాన్యుడిలా ఆయన ఫిర్యాదు చేయడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది.
హైదరాబాద్ కొత్వాల్ డయల్ 100కు కాల్ చేశారు. తన నివాస ప్రాంతంలో సౌండ్ పొల్యుషన్ ఆపాలని ఫిర్యాదు చేశారు. ఆయన నివాసం ఉండే జూబ్లీహిల్స్ రోడ్ నెంటర్ 10లో ప్లజెంట్ వ్యాలీలో సమీపంలో అర్ధరాత్రి సమయంలో శబ్ధకాలుష్యం పెరిగిందని ఫిర్యాదు చేశారు. ఆయన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు టపాసులు పేలుస్తూ న్యూసెన్స్ చేశారని ఫిర్యాదులో వెల్లడించారు. దీంతో ఆ డీజే హోరుతో శబ్ధ కాలుష్యం ఒక్కసారిగి పెరిగిందని డయల్ 100కు సీవీ ఆనంద్ కాల్ చేశారు. అయితే ఆ సమంయంలో నైట్ డ్యూటీలో ఉన్న జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాస్‌తోపాటు ఇతర సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు.
స్థానిక బస్తీలో తొట్టెల ఊరేగింపులో డప్పులు వాయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. తొట్టెల ఊరేగింపు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌పై 70బీ కింద కేసు నమోదు చేశారు.
అర్ధరాత్రి సమయాల్లో శబ్ధ కాలుష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నుంచి డయల్ 100కు కాల్ రావడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. సామాన్యుడిలా ఆయన ఫిర్యాదు చేయడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..