AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వరకట్న వేధింపులకు వివాహిత సూసైడ్.. భరించలేకపోతున్నానంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరీ..

వరకట్న వేధింపులకు మరో వివాహిత తనువు చాలించింది. గచ్చిబౌలిలో (Gachibowli) ఆత్మహత్య చేసుకున్న సునీత కేసులో కొత్తట్విస్టు బయటికొచ్చింది. భర్త, అత్త మామల వేధింపులు భరించలేకే ఆమె సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా...

Hyderabad: వరకట్న వేధింపులకు వివాహిత సూసైడ్.. భరించలేకపోతున్నానంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరీ..
Crime
Ganesh Mudavath
|

Updated on: Jul 31, 2022 | 1:36 PM

Share

వరకట్న వేధింపులకు మరో వివాహిత తనువు చాలించింది. గచ్చిబౌలిలో (Gachibowli) ఆత్మహత్య చేసుకున్న సునీత కేసులో కొత్తట్విస్టు బయటికొచ్చింది. భర్త, అత్త మామల వేధింపులు భరించలేకే ఆమె సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. భర్త వేధింపులు భరించలేకే ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. కారు కొనేందుకు రూ.10 లక్షలు తీసుకురావాలంటూ సునీత భర్త రమేశ్ చిత్రహింసలకు గురిచేశాడని, సునీతను తీవ్రంగా కొట్టానికి మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయాలన్నీ సునీత తమతో చెప్పుకుని, ఇక టార్చర్‌ భరించలేనంటూ బోరున విలపించిందని కన్నీటిపర్యంతమయ్యారు. ఆ తర్వాత సునీత ఫోన్‌ స్విఛాప్‌ అయ్యిందని, కంగారుగా వచ్చి చూసే సరికి సునీత ఫ్యాన్ కు ఉరేసుకుని మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. తమ కుమార్తె మృతికి అల్లుడు రమేశ్ కారణమంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విజయనగరం జిల్లాకు చెందిన సునీతకు అదే ప్రాంతానికి చెందిన రమేశ్ తో 2019లో వివాహమైంది. రమేశ్ ప్రైవేటు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లి సమయంలో కట్న కానుకల కింద బంగారం, రూ.14 లక్షలు, 20 సెంట్ల భూమి ఇచ్చారు. వివాహం తరువాత భర్తతో కలిసి ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న సునీతను అత్తమామ, భర్త అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో రమేశ్ ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు మకాం మార్చాడు. గచ్చిబౌలి సుదర్శన్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 24న అదనపు కట్నం విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. రమేష్ సునీతను తీవ్రంగా కొట్టాడు. భర్త తీరుతో విసిగిపోయిన సునీత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..