Palnadu District: పత్తి చేలో యూరియా మూట.. వెంటనే జేసీబీతో పెద్ద గుంత.. అనుమానంతో చెక్ చేయగా..
కోపం రాని మనిషి అంటూ ఉండదు. కానీ అది కంట్రల్‌లో ఉండాలి. ఏ మనిషికి అయినా విచక్షణ అనేది ఒకటి ఉంటుంది.. అది కోల్పోతే ఎన్నో అనర్థాలు ఎదురవుతాయి.
Andhra Pradesh: క్రైమ్ రేట్ రోజురోజుకు పెరిగిపోతుంది. క్షణికావేశంలో సొంతవారినే ఖతం చేస్తున్నారు కొందరు. కడుపున పుట్టినవారు అని కానీ, కట్టుకున్న పెళ్లాం అని కానీ చూడటం లేదు. తాజాగా పల్నాడు జిల్లాలో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. తండ్రి కొడుకుల మధ్య డబ్బు విషయంలో వాదన జరిగింది. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. ఆగ్రహంతో కన్న కొడుకునే చంపేశాడో తండ్రి. ఆపై శవాన్ని మాయం చేసేందుకు విశ్వప్రయత్నం చేశాడు. గ్రామస్థుల నుంచి సేకరించిన వివరాలు ప్రకారం… కొత్తపల్లి(Kothapalle) గ్రామంలో రాములమ్మ, వెండి శ్రీనివాసరావు దంపతులు నివాసం ఉంటారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులను 20 ఏళ్ల గోపి అనే తనయుడు ఉన్నారు. అయితే డబ్బుల విషయంలో ఈ శుక్రవారం నైట్ తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో తీవ్ర కోపోద్రిక్తుడైన తండ్రి పక్కనే ఉన్న ఇనుప రాడ్డుతో తనయుడి తలపై మోదాడు. దీంతో గోపి స్పాట్‌లోనే మృతిచెందాడు. ఆపై జైలుకి వెళ్లాల్సి వస్తుందని డెడ్ బాడీని మాయం చేసేందుకు స్కెచ్ గీశాడు. ఓ సంచిలో కొడుకు శవాన్ని కుక్కాడు. ఆ తర్వాత యూరియా కట్టలతో పాటు కొడుకు శవం ఉంచిన సంచిని ఆటోలో పొలానికి తీసుకెళ్లాడు.
అనంతరం పొలానికి జేసీబీని పిలిచి గుంత తవ్వించాడు. పంట మొక్కలు పెరిగిన పొలంలో.. ఎందుకు గుంత తవ్వించాడో సాటి రైతులకు అర్థం కాలేదు. దీంతో అనుమానం వచ్చి.. గ్రామస్థులు గట్టిగా అడగంతో.. అసలు విషయం తెలిసింది. స్థానికులు సమాచారంతో స్పాట్‌కు చేరుకున్న పోలీసులు .. డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..