Andhra Pradesh: ఫ్యామిలీ మధ్య గొడవ.. బాబాయ్ చెవి ఊడేలా కొరికేసిన అబ్బాయ్.. చెవి పట్టుకుని ఆస్పత్రికి పరుగో పరుగు

కొల్లూరు గ్రామానికి చెందిన చిన్నోడుకి, తల్లికి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ విషయాన్ని తల్లి పెద్ద కొడుకుకు చెప్పింది.

Andhra Pradesh: ఫ్యామిలీ మధ్య గొడవ.. బాబాయ్ చెవి ఊడేలా కొరికేసిన అబ్బాయ్.. చెవి పట్టుకుని ఆస్పత్రికి పరుగో పరుగు
Andhra Pradesh News
Follow us
Surya Kala

|

Updated on: Jul 31, 2022 | 12:53 PM

Andhra Pradesh: బాపట్ల జిల్లా (Bapatla District) కొల్లూరులో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఘర్షణలో చెవిని కొరికేశాడు. చొప్పర చిన్నోడు అనే వ్యక్తి చెవిని వూడి వచ్చేట్టు తన అన్న కొడుకు కొరికాడు. దీంతో వుడిపోయిన చెవిని తీసుకొని తెనాలి ప్రభుత్వ వైద్యులకు (Tenali Government Hospital) చేరుకున్నాడు చిన్నోడు. వివరాల్లోకి వెళ్తే..

కొల్లూరు గ్రామానికి చెందిన చిన్నోడుకి, తల్లికి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ విషయాన్ని తల్లి పెద్ద కొడుకుకు చెప్పింది. పెద్ద కుమారుడు తమ్ముడైన చిన్నొడిని మందలించాడు. ఈ క్రమంలో ఆగ్రహనికి గురైన చిన్నోడు, తన అన్నని కొట్టాడు. దీంతో కుటుంబ సభ్యులంతా కలిసి చిన్నొడి కాళ్లు, చేతులను బంధించారు. ఇంతలో అన్న కొడుకు వచ్చి చిన్నోడి చెవి వూడి వచ్చే విధంగా కొరికాడు. వూడిపోయిన చెవిని తీసుకుని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు వచ్చాడు చిన్నోడు. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం వైద్యులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..