Telangana: అమ్మో దెయ్యం.. స్కూల్ గోడ దూకి పారిపోయిన బాలికలు.. ఇంతకీ ఆక్కడ ఏం జరుగుతోంది?

Telangana: వరంగల్‌ జిల్లాలో దెయ్యం భయంతో గజగజ వణికిపోతున్నారు అమ్మాయిలు. జిల్లాలోని శంభునిపేట మైనారిటీ బాలికల గురుకుల స్కూల్‌లో ఎప్పుడేం..

Telangana: అమ్మో దెయ్యం.. స్కూల్ గోడ దూకి పారిపోయిన బాలికలు.. ఇంతకీ ఆక్కడ ఏం జరుగుతోంది?
Devil
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 01, 2022 | 10:01 PM

Telangana: వరంగల్‌ జిల్లాలో దెయ్యం భయంతో గజగజ వణికిపోతున్నారు అమ్మాయిలు. జిల్లాలోని శంభునిపేట మైనారిటీ బాలికల గురుకుల స్కూల్‌లో ఎప్పుడేం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దెయ్యం భయంతో గోడ దూకి ఇళ్లకు పారిపోతున్నారు బాలికలు. అసలేం జరిగిందంటే.. స్కూల్‌లో ఓ విద్యార్ధిని నిద్రపోతుంటే గొంతుపై కత్తి కాటు పడింది. దాంతో ఇది దెయ్యం వల్లే జరిగిందంటూ వదంతులు చెలరేగాయ్‌. అదెలా జరిగిందో తెలియదు.. ఏం జరిగిందో తెలియదు.. కానీ అదంతా దెయ్యం వల్లేనంటూ కలకలం రేగడంతో హడలిపోతున్నారు స్టూడెంట్స్‌.

పిల్ల పేరెంట్స్ సైతం భయపడిపోతున్నారు. హాస్టల్‌లో అసలేం జరుగుతుందో తెలియదు, కానీ పిల్లలు మాత్రం భయంతో వణికిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. అయితే, టీచర్సే కావాలని పిల్లలను భయపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు వస్తే, తమను లోపలికి రానివ్వడం లేదని అంటోంది ఓ మహిళ. హాస్టల్‌లో ఏమీ జరగకపోతే తమను ఎందుకు రానివ్వడం లేదని ప్రశ్నిస్తోంది. దెయ్యం భయంతో పిల్లలకు జ్వరాలు కూడా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్‌. దాంతో, హాస్టల్‌లో ఉండాలంటేనే భయపడిపోతున్నారు స్టూడెంట్స్‌. దెయ్యం భయంతో ఇద్దరు బాలికలు స్కూల్‌ నుంచి పారిపోవడంతో మిగతావాళ్లు కూడా బిక్కుబిక్కుమంటూనే అక్కడ ఉంటున్నారు. అయితే, ఇంత జరుగుతున్నా, అసలు అక్కడేం జరుగుతుందో వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు స్కూల్ సిబ్బంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..