Viral Video: ఇంట్లో వరలక్ష్మీ వ్రతం.. గడప ముందుకే వచ్చి పాలిస్తున్న గోమాత.. వీడియో చూస్తే అవాక్కే!

Viral Video: కర్నూలు జిల్లా కొడుమూరులో వింత ఘటన చోటు చేసుకుంది. ఇంట్లోకి ప్రవేశించిన ఓ ఆవు పాలు పితకకుండానే నేరుగా దార విడుస్తోంది.

Viral Video: ఇంట్లో వరలక్ష్మీ వ్రతం.. గడప ముందుకే వచ్చి పాలిస్తున్న గోమాత.. వీడియో చూస్తే అవాక్కే!
Cow Milk
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 05, 2022 | 6:40 PM

Viral Video: కర్నూలు జిల్లా కొడుమూరులో వింత ఘటన చోటు చేసుకుంది. ఇంట్లోకి ప్రవేశించిన ఓ ఆవు పాలు పితకకుండానే నేరుగా దార విడుస్తోంది. అది చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఇది నిజంగా పరమ శివుడి మహిమే అని, ఆ భగవంతుడి ఆశీర్వాదం తమకు దక్కిందంటూ ఆనందపరశవంతో మునిగిపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని కొడుమూరులో ఎస్ఐ విష్ణు నారాయణ ఇల్లు ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అక్కడే నివసిస్తున్నారు. ఇవాళ శ్రావణ శుక్రవారం కావడంతో.. ఎస్ఐ విష్ణు నారాయణ సతీమణి గుర్రమ్మ ఇంట్లో పూజలు నిర్వహిస్తుంది. ఆ సమయంలో ఇంటి గడప వద్దకు వచ్చిన ఆవు.. తానంతట తానే పాలు వదులుతోంది. ఆవు అలా పాలు వదులుతుండటం గమనించిన గుర్రమ్మ.. ఇంట్లో వారిని, ఇరుగుపొరుగు వారిని పిలిచి చూపించింది. ఆ దృశ్యాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. అదే సమయంలో పాలు పిండితే మాత్రం రావడం లేదు. తనంతకు తానే పాలు వదులుతోంది గోమాత. దాదాపు మూడు గంటల సేపు పాలు వదలడం చూసి ఆశ్చర్యపోతున్నారు జనాలు. ఇక తమ ఇంట్లోకి గోమాత వచ్చి పాలు వదలడాన్ని అదృష్టంగా భావిస్తున్నారు ఎస్ఐ విష్ణు నారాయణ, గుర్రమ్మ దంపతులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!