Video: నువ్వు బౌలింగ్ చేస్తే.. నేను స్మాష్ చేస్తా..! ధోని దోస్త్ కి ఇచ్చిపడేసిన వైభవ్ సూర్యవంశీ..
Jadeja vs Sooryavanshi ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ శిబిరంలో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. అనుభవజ్ఞుడైన జడేజా బౌలింగ్‌లో యువ సంచలనం సూర్యవంశీ ధాటిగా బ్యాటింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోరు జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ, అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది.

Jadeja vs Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్ దగ్గరపడుతున్న వేళ, అన్ని జట్లు ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఈసారి టైటిల్‌పై కన్నేసింది. 2008లో టైటిల్ గెలిచిన తర్వాత మరోసారి కప్పు అందుకోవాలని టీమ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మళ్లీ రాజస్థాన్ జట్టులో చేరడం పెద్ద ప్లస్‌గా మారింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో 12 ఏళ్ల విజయవంతమైన ప్రయాణం తర్వాత ఆయన మళ్లీ తన పాత జట్టుకు రావడం అభిమానులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. ట్రేడ్‌లో భాగంగా సంజూ శాంసన్ చెన్నై జట్టుకు వెళ్లడం విశేషం.
ట్రైనింగ్‌లో బ్యాట్ vs బాల్ పోరు వైరల్..
ప్రాక్టీస్ సెషన్‌లో జడేజా బౌలింగ్‌కు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ దూకుడుగా బ్యాటింగ్ చేయడం హైలైట్‌గా నిలిచింది. జడేజా వేసిన బంతులను సూర్యవంశీ స్టేడియం నలుమూలలా బాదుతూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
యువ సంచలనం సూర్యవంశీ..
సూర్యవంశీ ఇప్పటికే భారత అండర్-19 జట్టుకు వరల్డ్ కప్ గెలిపించి తన ప్రతిభను నిరూపించాడు. హరారేలో జరిగిన ఫైనల్‌లో అతని అద్భుత ఇన్నింగ్స్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా అదే ఫామ్ కొనసాగిస్తాడనే ఆశలు ఉన్నాయి.
జట్టులో కీలక పాత్ర..
రాజస్థాన్ రాయల్స్ మరోసారి టైటిల్ గెలవాలంటే యువ ఆటగాళ్లపై భారీ బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా సూర్యవంశీ లాంటి ప్లేయర్లు కీలకంగా మారనున్నారు. జడేజా అనుభవం, యువత ఉత్సాహం కలిస్తే ఈ సీజన్‌లో రాజస్థాన్ ప్రమాదకర జట్టుగా మారే అవకాశం ఉంది.
జడేజా vs సూర్యవంశీ ట్రైనింగ్ పోరు ఐపీఎల్ 2026కి మాంచి టీజర్‌లా మారింది. అనుభవంతోపాటు యువత పోరు అభిమానులకు మరింత ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
