AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: సర్‌ప్రైజ్.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా.. ఇంటిల్లిపాది నవ్వుకోండిక

ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైన ఈ తెలుగు సినిమా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. జాతకాలు, మూఢనమ్మకాలతో పెళ్లి చేసుకోని యువకుడు ప్రేమలో పడడం, ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎంతో వినోదాత్మకంగా తెరెకెక్కించారు. థియేటర్లలో ఆడియెన్స్ ను నవ్వించిన ఈ మూవీ ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: సర్‌ప్రైజ్.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా.. ఇంటిల్లిపాది నవ్వుకోండిక
Sree Vishnu Vishnu Vinyasam Movie
Basha Shek
|

Updated on: Mar 30, 2026 | 10:34 AM

Share

జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు హీరో శ్రీ విష్ణు. ఓ వైపు డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూనే మరో వైపు ఆడియెన్స్ కు మంచి ఎంటర్ టైన్మెంట్ అందిస్తున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. అలా గత నెలలో ఏకంగా రెండు సినిమాలతో మన ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు. అది కూడా ఒక వారం గ్యాప్ లో. అందులో విష్ణు విన్యాసం ఒకటి. ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాగానే ఆడింది. ఆడియెన్స్ కు మంచి ఎంటర్ టైన్మెంట్ అందించింది. ఇందులో శ్రీవిష్ణుకు జోడిగా నయన్ సారిక నటించింది. అలాగే సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్‌, సత్యం రాజేశ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శ్రీనివాస్‌ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు ప్రధాన పాత్రల్లో మెప్పించారు. ఇప్పుడీ సినిమా సడెన్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. అది కూడా రిలీజైన మూడు వారాల్లో ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా.

విష్ణు విన్యాసం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (మార్చి20) అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి ఇతర పాన్ ఇండియా భాషల్లోనూ విష్ణు విన్యాసం సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. సుమంత్ నాయుడు నిర్మించిన ఈ సినిమాకు రధన్ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ఈ కామెడీ ఎంటర్ టైనర్ ను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసేయండి.. కడుపుబ్బా నవ్వుకోండి.

ఇవి కూడా చదవండి

కథేంటంటే.. ఇందులో హీరో విష్ణు(శ్రీవిష్ణు) ఓ జూనియర్‌ లెక్చరర్‌. జాతకాలు, మూడనమ్మకాలటే అతనికి పిచ్చి.  అందుకే 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోడు. అతన్ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడుతుంది లెక్చరర్‌ మనీషా(నయనసారిక). ఆమె అలవాటు, ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటాయి. మొదట పట్టించుకోకపోయినా విష్ణు కూడా ఆమెను ఇష్టపడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతారు. ఇంతలో మనీషా ఓ నిజం చెబుతుంది. దీంతో వీరిద్దరి జీవితాలు మలుపు తిరుగుతాయి. మరి ఆ నిజమేంటి?  చివరికి విష్ణు, మనీషాలు పెళ్లి చేసుకున్నారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర