Komatireddy Raj Gopal Reddy: ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా.. లేఖలో ఏం రాశారంటే..?

Komatireddy Raj Gopal Reddy: తెలంగాణ శాసనసభ సభ్యత్వానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం అసెంబ్లీకి చేరుకున్న రాజగోపాల్ రెడ్డి..

Komatireddy Raj Gopal Reddy: ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా.. లేఖలో ఏం రాశారంటే..?
Komatireddy Raj Gopal Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 08, 2022 | 12:06 PM

Komatireddy Raj Gopal Reddy: తెలంగాణ శాసనసభ సభ్యత్వానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం అసెంబ్లీకి చేరుకున్న రాజగోపాల్ రెడ్డి.. స్పీకర్ పోచారం పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి రాజీనామా లేఖను అందించారు. పూర్తిగా స్పీకర్ ఫార్మాట్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పోచారానికి సమర్పించారు. కాగా.. లేఖ ఇచ్చిన 10 నిమిషాల్లోనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను ఆమోదించారు. పూర్తిగా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఉండటంతో వెంటనే పోచారం ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం.. రాజగోపాల్ రెడ్డి గవర్నర్ తమిళి సైను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. ఈ రోజు గవర్నర్ ను కలవనున్నారు. కాగా.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆరునెలల్లో లేదా అంతకుముందే మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నిక.. బీజేపీకి, అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్ కు సవాల్ గా మారనుంది.

మునుగోడు అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ నుంచి ప్రజలకు విముక్తి లభిస్తుందని పేర్కొన్నారు. ఇది కేసీఆర్ ప్రభుత్వంపై ప్రకటించిన ధర్మయుద్ధం అని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

కేసీఆర్ అరాచక పాలనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నానని.. సబ్బండ వర్గాలు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందంటూ పేర్కొన్నారు. తన రాజీనామాతో జరిగే ఉప ఎన్నికలో మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇస్తారంటూ పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలవాలని చూస్తే అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదంటూ రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

ఈనెల 4న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. ఆగస్టు 5న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాజగోపాల్‌ తాను ఈనెల 21 బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీజేపీలో చేరుతానని ప్రకటించారు.

రాజీనామాకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!