AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అకాల మరణం.. భార్య సమాధి వద్ద భర్త ఆత్మహత్య

ఓ భర్త.. తన భార్య మరణించిన రెండేళ్లు అయినా మరచిపోలేకపోయాడు. భార్య ఎడబాటుని తట్టుకోలేని.. ఆ భర్త భార్య సమాధి వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిలాల్లో చోటు చేసుకుంది.

Telangana: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అకాల మరణం.. భార్య సమాధి వద్ద భర్త ఆత్మహత్య
Telangana
Surya Kala
|

Updated on: Aug 08, 2022 | 10:11 AM

Share

Telangana: ప్రేమ ఇద్దరు వ్యక్తులను ఏకం చేస్తే.. అదే ప్రేమ కొందరి వ్యక్తుల మధ్య విషాదాన్ని కూడా మిగులుస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను రకరకాల కారణాలతో మోస చేసిన ప్రభుద్ధులకు చెందిన వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. అయితే కొందరు భర్తలు తమ భార్యను ప్రాణంలో ప్రాణంగా ప్రేమిస్తారు.. భార్య తమని విడిచి శాశ్వతంగా వెళ్తే.. ఆ దుఃఖాన్ని భరించలేక ఆవేదన కు గురవుతారు. అయితే ఓ భర్త.. తన భార్య మరణించిన రెండేళ్లు అయినా మరచిపోలేకపోయాడు. భార్య ఎడబాటుని తట్టుకోలేని.. ఆ భర్త భార్య సమాధి వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిలాల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన 28 ఏళ్ల పుట్ట సురేష్.. అదే గ్రామానికి చెందిన నిర్మల అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్య నిర్మల అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మరణించింది. భార్య అకాల మరణాన్ని సురేష్ తట్టుకోలేకపోయాడు. భార్య లేని జీవితం తనకు వద్దు అంటూ.. భార్య నిర్మల సమాధి వద్ద భర్త సురేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈనెల రెండవ తారీఖున ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్యాప్రయత్నం చేసిన సురేష్ ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. సురేష్ మృతి చెందాడు. సురేష్ మృతితో కుటుంబంలో  గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకొన్న రాజంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ