TS Weather Alert: తెలంగాణ వాసులకు హెచ్చరిక.. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

రుతుపవనాల ద్రోణి ప్రభావంతో నేడు, రేపు రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

TS Weather Alert: తెలంగాణ వాసులకు హెచ్చరిక.. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
Follow us
Surya Kala

|

Updated on: Aug 08, 2022 | 6:48 AM

TS Weather Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రమై ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం మీద ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించింది. అల్పపీడనం బలపడి.. వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ పేర్కొంది. ఇది ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా క్రమంగా పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వివరించింది. రుతుపవనాల ద్రోణి ప్రభావంతో నేడు, రేపు రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలోని ఉత్తర జిల్లాలకు ఆగస్టు 8 , 9 తేదీల్లో ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ చాలా భారీ వర్షపాతాన్ని సూచిస్తుందియు రెడ్ అలర్ట్ అత్యంత భారీ వర్షపాతాన్ని సూచిస్తుంది. ఒడిశా-పశ్చిమ బంగాళాఖాతంలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని IMD తెలిపింది.

కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్), జనగాం, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈరోజు  రెడ్ అలర్ట్ ప్రకటించారు. కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్) జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

ఆగస్టు 9న ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, రాజన్న-సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు.  కామారెడ్డి, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్), జనగాం జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

హైదరాబాద్‌లో.. రెండు రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత 24 గంటలుగా హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భాగ్యనగర వాసులు తడిసి ముద్దయ్యారు. రహదారులు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కోఠి, అబిడ్స్, అమీర్ పెట్, పంజాగుట్ట, దిల్ షుఖ్ నగర్, నారాయణగూడ, ఖైరతాబాద్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో తెల్లవారు జామునుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!