Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Komatireddy Raj Gopal Reddy: ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నేడే..! స్పీకర్‌ అపాయింట్‌మెంట్ దొరుకుతుందా..?

Komatireddy Raj Gopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు రాజీనామా చేయనున్నారు?. ఇవాళ స్పీకర్‌ అపాయింట్‌మెంట్ దొరుకుతుందా? లేదా? అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోతే ఏం చేస్తారు?

Komatireddy Raj Gopal Reddy: ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నేడే..! స్పీకర్‌ అపాయింట్‌మెంట్ దొరుకుతుందా..?
Komatireddy Rajagopal Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 08, 2022 | 6:45 AM

Komatireddy Raj Gopal Reddy: శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అసెంబ్లీ స్పీకర్‌ను కలవనున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రోజే, ఎమ్మెల్యే పదవికీ రిజైన్‌ చేస్తున్నట్లు అనౌన్స్‌ చేశారు రాజగోపాల్‌. ఆ నెక్ట్స్‌ డేనే, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అపాయింట్‌మెంట్ కోరారు. అయితే, స్పీకర్‌ అందుబాటులో లేకపోవడంతో రాజీనామా ఆలస్యమైంది. స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ కన్ఫ్మామ్‌ కాకపోవడంతో వెయిట్‌ చేస్తున్నట్లు తెలిపారు రాజగోపాల్‌రెడ్డి. ఇవాళ స్పీకర్‌ అందుబాటులోకి వస్తారని అసెంబ్లీ సెక్రటరీ చెప్పారని, ఆయన అపాయింట్‌మెంట్‌ ఇవ్వగానే కలుస్తానని చెప్పారు. అపాయింట్‌మెంట్‌ ఇచ్చాకే, స్పీకర్‌ను స్వయంగా కలిసి రాజీనామా లేఖ అందిస్తా, దగ్గరుండి ఆమోదించుకుంటా అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.

స్పీకర్‌ అపాయింట్‌మెంట్ ఆలస్యమైతే, అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా లేఖ సమర్పిస్తానంటున్నారు రాజగోపాల్‌రెడ్డి. ఆ తర్వాత స్టేట్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌కు, కేంద్ర ఎన్నికల సంఘానికి మెయిల్‌ ద్వారా రిజైన్‌ లెటర్‌ను పంపనున్నట్లు తెలిపారు. మరి, ఇవాళ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తారా? లేక డిలే అవుతుందా? ఒకవేళ స్పీకర్ అపాయింట్‌మెంట్ దొరకకపోతే, చెప్పినట్టుగా అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా లేఖ సమర్పిస్తారా?. ఏది ఒకటి ఇవాళ క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..