Pension Plan: రూ.210 ఇన్వెస్ట్‌మెంట్‌తో నెలకు రూ.5000 పెన్షన్‌.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..!

Atal Pension Yojana: మీరు మీ పదవీ విరమణ తర్వాత కూడా పెన్షన్ కోసం ప్లాన్ చేస్తుంటే, ఇది మీకు మంచి ప్రయోజనకరమైన వార్తేనని చెప్పాలి. ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన మీకు ప్రయోజనం..

Pension Plan: రూ.210 ఇన్వెస్ట్‌మెంట్‌తో నెలకు రూ.5000 పెన్షన్‌.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..!
Atal Pension Yojana
Follow us
Subhash Goud

|

Updated on: Aug 08, 2022 | 6:00 AM

Atal Pension Yojana: మీరు మీ పదవీ విరమణ తర్వాత కూడా పెన్షన్ కోసం ప్లాన్ చేస్తుంటే, ఇది మీకు మంచి ప్రయోజనకరమైన వార్తేనని చెప్పాలి. ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన మీకు ప్రయోజనం కలిగిస్తుంది. ఇందులో మీరు, మీ భార్య వేర్వేరు ఖాతాలను తెరవడం ద్వారా నెలవారీ రూ.10,000 వరకు పెన్షన్ తీసుకోవచ్చు. అటల్ పెన్షన్ యోజన ప్రభుత్వ పథకం. ఇందులో మీ తరపున పెట్టుబడి మీ వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. ఈ పథకం కింద మీరు నెలవారీ కనిష్టంగా రూ. 1,000, రూ. 2000, రూ. 3000, రూ. 4000, గరిష్టంగా రూ.5,000 పెన్షన్ పొందవచ్చు. ఇది సురక్షితమైన పెట్టుబడి. ప్రతి 6 నెలలకు కేవలం రూ.1239 పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రభుత్వం నెలకు రూ.5000 అంటే 60 ఏళ్ల తర్వాత సంవత్సరానికి రూ.60,000 పెన్షన్‌కు హామీ ఇస్తుంది. భార్యాభర్తలిద్దరూ పెట్టుబడి పెడితే ఏటా రూ.1.2 లక్షల పెన్షన్ లభిస్తుంది. ఈ పథకంలో డిపాజిటర్లు 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ పొందుతారు.

పెట్టుబడి కోసం మూడు రకాల ఆప్షన్స్‌ను ఎంచుకోవచ్చు. మీరు మొత్తాన్ని నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధ సంవత్సరానికి జమ చేయవచ్చు. అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టే వ్యక్తులు రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందుతారు. సభ్యుని పేరిట ఒక ఖాతా మాత్రమే తెరవబడుతుంది. సభ్యుడు 60 సంవత్సరాలకు ముందు లేదా ఆ తర్వాత మరణిస్తే, అప్పుడు పెన్షన్ మొత్తం భార్యకు ఇవ్వబడుతుంది. భార్యాభర్తలిద్దరూ చనిపోతే నామినీకి ప్రభుత్వం పింఛను ఇస్తుంది.

18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు గరిష్టంగా రూ.5,000 నెలవారీ పెన్షన్ కోసం 18 ఏళ్ల వయస్సులో ఈ పథకంలో చేరినట్లయితే మీరు ప్రతి నెలా రూ.210 మాత్రమే చెల్లించాలి. ప్రతి 3 నెలలకు ఇదే మొత్తాన్ని డిపాజిట్ చేయాలంటే రూ.626, 6 నెలల్లో ఇస్తే రూ.1,239 చెల్లించాల్సి ఉంటుంది. మీకు 18 సంవత్సరాలు, ఈ పథకం నుండి నెలవారీ 1000 రూపాయల పెన్షన్ కావాలంటే, మీరు నెలకు 42 రూపాయలు మాత్రమే చెల్లించాలి.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్‌లో ఖాతా ఎలా తెరవాలి..?

☛ మీకు SBIలో ఖాతా ఉంటే, మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

☛ దరఖాస్తు చేయడానికి మీరు ముందుగా SBIకి లాగిన్ అవ్వాలి.

☛ ఆ తర్వాత e-Services లింక్‌పై క్లిక్ చేయండి.

☛ తెరుచుకునే కొత్త విండోలో సోషల్ సెక్యూరిటీ స్కీమ్ పేరుతో ఒక లింక్ ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేయాలి.

☛ ఆ తర్వాత మీకు PMJJBY/PMSBY/APY అనే మూడు ఆప్షన్స్‌ కనిపిస్తాయి. ఇక్కడ మీరు APY అంటే అటల్ పెన్షన్ యోజనపై క్లిక్ చేయాలి.

☛ ఆ తర్వాత మీరు మీ పూర్తి వివరాలను నింపాలి. ఇందులో సరైన ఖాతా నంబర్, పేరు, వయస్సు, చిరునామా మొదలైనవి ఇవ్వాలి.

☛ నెలవారీ రూ. 5,000 లేదా రూ. 1,000 వంటి పెన్షన్ ఆప్షన్ష్‌లో ఏదైనా దానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

☛ ఆ తర్వాత మీ వయస్సు ఆధారంగా మీ నెలవారీ సహకారం నిర్ణయించబడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..