మీరు ఆరోగ్య బీమా పాలసీని తీసుకుంటున్నారా..? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి!

Subhash Goud

Subhash Goud |

Updated on: Aug 07, 2022 | 7:35 AM

Best Health Insurance: ఈరోజుల్లో చాలా మంది ఆరోగ్యంపై ఎంతో దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే రకరకాల వైరస్‌లు చుట్టుముడుతున్నారు. కరోనాతో పాటు కొత్త కొత్త వైరస్‌లు..

మీరు ఆరోగ్య బీమా పాలసీని తీసుకుంటున్నారా..? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి!

Best Health Insurance: ఈరోజుల్లో చాలా మంది ఆరోగ్యంపై ఎంతో దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే రకరకాల వైరస్‌లు చుట్టుముడుతున్నారు. కరోనాతో పాటు కొత్త కొత్త వైరస్‌లు వస్తుండటంతో ముందస్తుగానే అప్రమత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది హెల్త్‌ ఇన్సూరెన్స్‌లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అయినప్పటికీ ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. దీనివల్ల ఆసుపత్రుల చుట్టు తిరగాల్సి ఉంటుంది. వైద్యానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. వైద్య ఖర్చులను నివారించడానికి ప్రజలు ఆరోగ్య బీమాపై చాలా శ్రద్ధ వహిస్తున్నారు. ఆరోగ్య ప్రణాళిక సహాయంతో, ఆసుపత్రికి సంబంధించిన అనేక పెద్ద ఖర్చులను అధిగమించవచ్చు. చాలా కంపెనీలు మార్కెట్‌లో హెల్త్ ప్లాన్‌లను అందిస్తున్నప్పటికీ, వాటిలో ఏది మంచిదో తెలుసుకోవడంలో చాలా మంది తికమక పడుతుంటారు. 65 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల కోసం నిపుణుల వివరాల ప్రకారం టాప్ ఆరోగ్య బీమా పథకాల గురించి అందిస్తున్నాము.

పాలసీలు తీసుకునే ముందు వీటిని తెలుసుకోండి:

– వయస్సు ప్రమాణాలు

– ప్రీమియం, కవరేజ్

– వెయిటింగ్ పీరియడ్

– క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్ ప్రయోజనాలు

– ముందు మరియు ఆసుపత్రిలో చేరిన తర్వాత కవరేజ్ – ప్రసూతి కవరేజ్ – నో-క్లెయిమ్-బోనస్/నో-క్లెయిమ్-డిస్కౌంట్

ఇక్కడ టాప్ ఆరోగ్య బీమా పథకాలు ఉన్నాయి

☛ ఎల్‌ఐసీ బీమా పాలసీ

☛ నివా బుపా- ఆరోగ్య భరోసా

☛ లైఫ్‌లైన్ (సుప్రీమ్ ప్లాన్)

☛ మాగ్మా హెచ్‌డిఐ- వన్ హెల్త్ (ప్రీమియం ప్లాన్)

☛ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో- ఆప్టిమా రిస్టోర్

☛ ఆదిత్య బిర్లా హెల్త్- యాక్టివ్ హెల్త్ ప్లాంటినమ్ (ప్రీమియర్ ప్లాన్)

☛ ఎడెల్వీస్ జనరల్- ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ (గోల్డ్ ప్లాన్)

☛ కేర్ ఇన్సూరెన్స్- కేర్

☛ ICICI లాంబార్డ్- కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్ (హెల్త్ ఎలైట్ ప్లాన్)

☛. HDFC ఎర్గో- ఆప్టిమా సెక్యూర్

☛ మణిపాల్ సిగ్నా- ప్రోహెల్త్ (ప్లస్ ప్లాన్)

☛ చోళ ఎంఎస్- ఫ్లెక్సీ హెల్త్

☛  ఆదిత్య బిర్లా ఆరోగ్యం- యాక్టివ్ అష్యూర్

☛ స్టార్ హెల్త్- సమగ్ర

ఇంకో విషయం ఏంటంటే ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే ముందు పాలసీకి సంబంధించిన వివరాలన్ని పూర్తిగా తెలుసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఏవైనా సందేహాలుంటే ముందుగాననే ఇన్సురెన్స్‌ ఏజంటును గానీ, సంబంధిత అధికారులను అడగండి. ఎందులో ఎక్కువ ప్రయోజనాలు ఉంటే ఈ పాలసీని కొనుగోలు చేయడం మంచిదంటున్నారు నిపుణులు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu