Kisan Yojana: రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త.. భారీ ప్రయోజనం

Kisan Yojana: కిసాన్ పోర్టల్: దేశంలోని రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. రైతులను దృష్టిలో ఉంచుకుని వారికి మేలు చేయడమే ప్రభుత్వ పథకాల..

Kisan Yojana: రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త.. భారీ ప్రయోజనం
Kisan Yojana
Follow us
Subhash Goud

|

Updated on: Aug 07, 2022 | 8:01 AM

Kisan Yojana: కిసాన్ పోర్టల్: దేశంలోని రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. రైతులను దృష్టిలో ఉంచుకుని వారికి మేలు చేయడమే ప్రభుత్వ పథకాల ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు ఇప్పుడు రుణం పొందిన రైతులకు ప్రభుత్వం పెద్ద ప్రకటన చేసింది. దీంతో వేలాది మంది రైతులకు ఈ ప్రయోజనం కలుగనుంది. రుణం పొందిన రైతులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని ప్రకటించింది హర్యానా ప్రభుత్వం. దీంతో పాటు రైతుల అనేక ఖర్చులు కూడా మాఫీ కానున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది.

అప్పులపాలైన రైతుల కోసం హర్యానా వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని ప్రకటించింది. రుణం పొందిన రైతులు లేదా జిల్లా వ్యవసాయ, ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు సభ్యుల కోసం హర్యానా ప్రభుత్వం వన్-టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా హర్యానా రాష్ట్ర సహకార శాఖ మంత్రి బన్వారీ లాల్ మాట్లాడుతూ.. రుణ సభ్యులకు ప్రకటించిన పథకం కింద బకాయి ఉన్న వడ్డీపై 100 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

రుణం తీసుకున్న రైతు చనిపోతే, అతని వారసులు 2022 మార్చి 31లోపు అసలు మొత్తాన్ని జమ చేస్తే ఈ మినహాయింపు ఉంటుందని తెలిపారు. దీని కోసం అసలు మొత్తాన్ని రుణ ఖాతాలో జమ చేస్తే మరణించిన రుణగ్రహీతల వారసులకు వడ్డీలో 100% రాయితీ అందించబడుతుందని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇతర ఖర్చులు కూడా మాఫీ చేయబడ్డాయి

దీంతో పాటు పెనాల్టీ, వడ్డీ, ఇతర ఖర్చులు కూడా మాఫీ కానున్నాయి. బ్యాంకులో చనిపోయిన రుణగ్రహీతల సంఖ్య 17,863 కాగా, వారి మొత్తం బకాయిలు రూ.445.29 కోట్లు అని, ఇందులో అసలు మొత్తం రూ.174.38 కోట్లు, వడ్డీ రూ.241.45 కోట్లు, అపరాధ వడ్డీ రూ.29.46 కోట్లు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..