PNB Cyber Crime: పంజాబ్ నేషనల్ బ్యాంకు కస్టమర్ల కోసం కీలక సమాచారం.. సైబర్ నేరాల కోసం కొత్త అప్‌డేట్?
PNB Cyber Crime: దేశంలోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైబర్ క్రైమ్‌లకు సంబంధించి తన కస్టమర్లకు అవసరమైన సమాచారాన్ని..
PNB Cyber Crime: దేశంలోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైబర్ క్రైమ్‌లకు సంబంధించి తన కస్టమర్లకు అవసరమైన సమాచారాన్ని జారీ చేసింది. సైబర్ నేరాల నుంచి తన కస్టమర్లను అప్రత్తం చేస్తున్న బ్యాంకు.. సైబర్ క్రైమ్ ఫిర్యాదును ఫైల్ చేయడానికి అవసరమైన ప్లాట్‌ఫారమ్‌ల గురించి తన కస్టమర్‌లకు తెలియజేసింది. ఇక్కడ మీరు సైబర్ క్రైమ్‌పై ఫిర్యాదు చేయవచ్చు. ఈ మేరకు సదరు బ్యాంక్ తన కస్టమర్‌లకు సమాచారం ఇస్తూ మీరు ఎలాంటి సైబర్ క్రైమ్‌కు గురైనట్లయితే, మీరు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌ని సందర్శించవచ్చు. http://cybercrime.gov.inలో మీరు కూడా నమోదు చేసుకోవచ్చు.
ఫిర్యాదు చేయండిలా..
మీరు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ హెల్ప్‌లైన్ నంబర్-1930కి కాల్ చేయడం ద్వారా కూడా మీ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు మీ సమీప పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పుడు మన ముఖ్యమైన పనుల కోసం బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండకుండా ఇంట్లోనే ఉండి చేసుకునే ఎన్నో సదుపాయాలు వచ్చాయి. డిజిటల్ ప్రపంచంలో ఎన్నో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
దేశంలో సైబర్ క్రైమ్
కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డిజిటల్ చెల్లింపుల వల్ల ఎంత లాభమో, నష్టమో తెలుసుకోవడం కూడా ముఖ్యం. భారత ప్రభుత్వం నుండి దేశంలోని అన్ని బ్యాంకుల వరకు, సైబర్ క్రైమ్‌ను ఎలా నివారించాలో మేము చెబుతూనే ఉంటాము. ఈ డిజిటల్ యుగంలో చాలా మంది దుండగుల బారిన పడ్డారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి