Ration Card: ఇంట్లో కూర్చొని రేషన్ కార్డు సమాచారాన్ని తనిఖీ చేయండి.. తప్పులను సరిదిద్దుకోండి.. ఎలాగంటే..!

Ration Card Details: పేదలకు చౌకగా ఆహార ధాన్యాలు పొందడానికి రేషన్ కార్డు అత్యంత ప్రభావవంతమైన మార్గం. అయితే , ఈ రేషన్ కార్డుతో పాటు అనేక ఇతర ఉపయోగాలు..

Ration Card: ఇంట్లో కూర్చొని రేషన్ కార్డు సమాచారాన్ని తనిఖీ చేయండి.. తప్పులను సరిదిద్దుకోండి.. ఎలాగంటే..!
Ration Card Details
Follow us
Subhash Goud

|

Updated on: Aug 05, 2022 | 5:43 AM

Ration Card Details: పేదలకు చౌకగా ఆహార ధాన్యాలు పొందడానికి రేషన్ కార్డు అత్యంత ప్రభావవంతమైన మార్గం. అయితే , ఈ రేషన్ కార్డుతో పాటు అనేక ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇది మీ గుర్తింపు కార్డులా కూడా పనిచేస్తుంది. మీరు మీ రేషన్ కార్డు గురించిన పూర్తి సమాచారాన్ని మీ వద్ద ఉంచుకోవడం, మీరు ఏదైనా లోపాన్ని గుర్తిస్తే సకాలంలో సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం. ఇది పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి సహాయపడుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ ప్రజలకు వారి రేషన్ కార్డు గురించి సులభంగా సమాచారాన్ని అందించడానికి మార్గాలను అందిస్తాయి. రాజస్థాన్ ప్రభుత్వం ఇంట్లో కూర్చొని రేషన్ కార్డు పొందే సదుపాయం అందిస్తోంది. రాజస్థాన్‌ వాసులైతే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.

షన్ కార్డు వల్ల ఉపయోగం ఏమిటి?

మీరు రేషన్ కార్డును గుర్తింపు రుజువు, నివాస రుజువుగా ఉపయోగించవచ్చు. ప్రభుత్వం అనేక పథకాలలో మీరు దానిని ID లేదా చిరునామా రుజువుగా ఉపయోగించవచ్చు. దీని సహాయంతో మీరు ఉచిత ఆహార ధాన్యాలతో పాటు సబ్సిడీ ఆహార ధాన్యాలు, ఆస్పత్రుల్లో, గ్యాస్‌ సిలిండర్‌ కోసం ఉపయోగించుకోవచ్చు. రేషన్ కార్డు సహాయంతో మీరు బ్యాంక్ ఖాతా తెరవడం, పాస్‌పోర్ట్ పొందడం, LPG కనెక్షన్ పొందడం, SIM కార్డ్, ల్యాండ్‌లైన్ కనెక్షన్ పొందడం వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. చాలా మంది రేషన్‌ కార్డుల్లో ఉన్న పొరపాట్లను సరిదిద్దుకోలేకపోతున్నారు. అలాగే కొన్ని పొరపాట్ల వల్ల రేషన్ కార్డును సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం ఇలాంటి సదుపాయాన్ని కల్పించింది. దీనిలో మీరు ఇంట్లో కూర్చొని రేషన్ కార్డు సమాచారాన్ని పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇంట్లో కూర్చొని రేషన్ కార్డు సమాచారాన్ని ఎలా పొందాలి

☛ దీని కోసం మీరు ముందుగా food.raj.nic.in ని సందర్శించాలి

☛ దీని తర్వాత మీరు రేషన్ కార్డు ఎంపికను ఎంచుకోవాలి.

☛ రేషన్ కార్డు ఎంపికలో మీరు జిల్లా ఆధారంగా రేషన్ కార్డు సమాచారం ఎంచుకోవాలి

☛ ఇందులో మీరు మీ జిల్లాను ఎంపిక చేసుకోండి

☛ జిల్లాను ఎంచుకున్న తర్వాత గ్రామీణ లేదా పట్టణ రేషన్ కార్డు నుండి మీ కార్డును ఎంచుకోండి

☛ దీని తర్వాత మీ బ్లాక్‌ని ఎంచుకోండి

☛ దీని తర్వాత పంచాయతీ, గ్రామం, రేషన్ దుకాణం పేరును ఎంచుకోండి.

☛ ఇక్కడ మీరు మీ రేషన్ కార్డును చూడవచ్చు

☛ ఇక్కడ జాబితాలో మీ పేరు లేకుంటే, వెంటనే నమోదు చేసుకోండి.

ఇంకో విషయం ఏంటంటే రాజస్థాన్‌ రాష్ట్రమే కాకుండా ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల వారు కూడా చెక్‌ చేసుకోవచ్చు. కానీ ఈ సదుపాయాన్ని అందిస్తున్న రాష్ట్రాల వివరాలు మాత్రమే తెలుసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రేషన్‌ కార్డు గురించి ఎలాంటి సదుపాయాలు అందించడం లేదు. అలాంటి రాష్ట్రాల రేషన్‌ కార్డుదారులు వివరాలు తెలుసుకోవడం కష్టం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..