Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money9: భారీగా పడిపోయిన ‘ఉల్లి’ ధర.. లబోదిబోమంటున్న రైతులు.. కిలోకు ఎంతంటే..!

Money9: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు కూడా మండిపోతున్నాయి. అయితే ఇటీవల ఉల్లి ధర కూడా కోయకుండానే కన్నీళ్లు పెట్టించింది. విపరీతంగా ధర..

Money9: భారీగా పడిపోయిన 'ఉల్లి' ధర.. లబోదిబోమంటున్న రైతులు.. కిలోకు ఎంతంటే..!
Onion Price
Follow us
Subhash Goud

|

Updated on: Aug 04, 2022 | 8:01 AM

Money9: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు కూడా మండిపోతున్నాయి. అయితే ఇటీవల ఉల్లి ధర కూడా కోయకుండానే కన్నీళ్లు పెట్టించింది. విపరీతంగా ధర పెరగడంతో సామాన్యుడు సైతం కొనాలంటేనే వెనుకంజ వేసేవాడు. ప్రతి వంటల్లో ఉల్లిపాయలు తప్పనిసరి. అందుకే ఎంత ధర ఉన్నా.. కొనక తప్పడం లేదు. దీని ప్రభావం సామాన్య ప్రజల్లో తీవ్రంగా ఉండేది. ప్రస్తుతం ఉల్లి ధర పడిపోయింది. దేశీయ మార్కెట్లో ఉల్లి ధర తగ్గముఖం పట్టడంతో ఉల్లి పండించే రైతులు లబోదిబోమంటున్నారు. తమకు అనుకున్న ధర రాక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉల్లి గత నెలలో ధరలు సుమారు 19 శాతం తగ్గాయి. గత సంవత్సరంతో పోలిస్తే ధర సుమారు 32 శాతం తగ్గిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలోని లాసల్‌గావ్‌ మండిలో కిలో ధర దాదాపు రూ.11కి పడిపోయింది. ఇప్పుడు ఇంత తక్కువ ధర కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. మహారాష్ట్రలోని ఉల్లి రైతుల సంఘం ప్రభుత్వాలను సగటున కిలోకు రూ.25 ధరను డిమాండ్ చేస్తోంది. ధర రాకపోతే ఆగస్టు 16 నుండి మార్కెట్‌లో ఉల్లి సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు రైతులు.

ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉల్లి ఉత్పత్తి..

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది దేశంలోనే ఉల్లి రికార్డు స్థాయిలో ఉత్పత్తి కావడం, మండీల్లో సరఫరా ఎక్కువగా ఉండడంతో రైతులు కోరుకున్న ధర లభించడం లేదు. ప్రభుత్వ లెక్కలను పరిశీలిస్తే.. ఈ ఏడాది దేశంలో 317 లక్షల టన్నులకు పైగా ఉల్లి దిగుబడి వచ్చింది. ఇది గత సంవత్సరం కంటే సుమారు 51 లక్షల టన్నులు అధికంగా ఉంది.

మనీ9 అంటే ఏమిటి?

Money9 OTT యాప్ ఇప్పుడు Google Play, iOSలో అందుబాటులో ఉంది. వ్యక్తిగత ఫైనాన్స్‌కు సంబంధించిన ప్రతి సమాచారం.. ఏడు భాషల్లో ఇందులో అందుబాటులో ఉంటుంది. దీనిలో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి, పన్ను, ఆర్థిక విధానాలు మొదలైనవి సవివరంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఆదాయం, బడ్జెట్‌ను ప్రభావితం అంశాలను కూడా తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోని.. మీ ఆర్థిక అవగాహనను మరింత పెంచుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి