Money9: నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ తో గుడ్‌ రిటర్న్స్‌ పొందడం ఎలాగో తెలుసా?

National Pension System: పదవీ విరమణ చేసిన తరువాత జీవితానికి అవసరమైన ఆర్థిక భద్రత కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్‌(NPS)లో పెట్టుబడి ఒక మంచి ఎంపిక అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 2004 జనవరిలో కేవలం కేవలం ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే..

Money9: నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ తో గుడ్‌ రిటర్న్స్‌ పొందడం ఎలాగో తెలుసా?
National Pension System
Follow us

|

Updated on: Aug 03, 2022 | 8:02 AM

National Pension System: పదవీ విరమణ చేసిన తరువాత జీవితానికి అవసరమైన ఆర్థిక భద్రత కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్‌(NPS)లో పెట్టుబడి ఒక మంచి ఎంపిక అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 2004 జనవరిలో కేవలం కేవలం ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం 2009లో అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రిటైర్మెంట్‌ తర్వాత జీవితాన్ని సమర్థంగా ప్లాన్ చేసుకోవడానికి ఇది ఆకర్షణీయమైన దీర్ఘకాలిక పొదుపు మార్గం. రిటర్న్స్‌, అలాగే పన్నులకు సంబంధించి మంచి ప్రయోజనాలుండడంతో చాలామంది ఈ స్కీమ్‌లో చందాదారులుగా చేరుతున్నారు. గత ఐదేళ్లుగా ఈ సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ పెన్షన్ పథకంలో పెట్టుబడులు పెట్టేందుకు రెండు ఎంపికలు ఉన్నాయి. అందులో ఒకటి ఆటో చాయిస్‌ మరొకటి యాక్టివ్‌ చాయిస్‌. NPS లో ఇన్వెస్ట్‌ చేసే ముందు, ఈ పథకంలో ఎలాంటి రిటర్న్స్‌, ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ ఉన్నాయో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం

ఈ స్కీమ్‌లో ప్రతీ నెలా కొంత మొత్తం చొప్పున పొదుపు చేయాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ వరకు పొదుపు చేసి రిటైర్మెంట్ తర్వాత ప్రతీ నెలా కొంత మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో పొదుపు చేసే మొత్తానికి వచ్చే రిటర్న్స్ రెగ్యులేటెడ్ మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి. 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత, ఖాతాలో జమ చేసిన మొత్తం సొమ్ములో 60 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే 40 శాతం మొత్తంతో యాన్యుటీని కొనుగోలు చేయాలి. యాన్యుటీ ద్వారా రెగ్యులర్ ఆదాయం పెన్షన్ రూపంలో లభిస్తుంది. ఫండ్ మేనేజర్ NPSలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఈక్విటీలు, కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతారు. పెట్టుబడిదారుడు తన పెట్టుబడిలో ఉంచవలసిన ఈక్విటీ, డెట్ మొత్తాన్ని తెలుసుకోవడానికి ఆటో, యాక్టివ్‌ల రూపంలో రెండు ఎంపికలను పొందుతాడు. ఈ పథకం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ లింక్‌పై క్లిక్ చేసి, Money9 అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.  https://onelink.to/gjbxhu

మనీ9 అంటే..

ఇవి కూడా చదవండి

Money9 OTT యాప్ ప్రస్తుతం Google Play, iOSలో అందుబాటులో ఉంది. డబ్బుకు సంబంధించిన ప్రతిదీ ఇందులో ఏడు భాషల్లో అందుబాటులో ఉంటుంది. బడ్జెట్‌ వివరాల నుంచి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి, పన్ను, ఆర్థిక విధానాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు ఇందులో చాలా సరళంగా అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. Money9 యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీ ఆర్థిక అవగాహనను పెంచుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి